- 100 కోట్ల డాలర్ల పెట్టుబడి
ఓపెన్ ఏఐ స్టార్టప్ తీసుకొచ్చిన ‘చాట్‌జీపీటీ’ సర్వీస్ విజయవంతం కావడంతో గ్లోబల్ టెక్ దిగ్గజాల నుంచి దేశీయ ఐటీ సంస్థల వరకు.. దాదాపు అన్ని ఐటీ సంస్థలూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్ అభివ్రుద్ధిపై ఫోకస్ చేస్తున్నాయి. ప్రత్యేకంగా ఏఐ టూల్స్ డెవలప్ చేయడానికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఈ దశలో దేశీయ ఐటీ మేజర్ విప్రో కీలక నిర్ణయం తీసుకున్నది. వచ్చే మూడేండ్లలో ప్రత్యేకంగా ‘aఱ విప్రో 360’ సంస్థను ఏర్పాటు చేయబోతున్నది. దీని కోసం 100 కోట్ల డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్లు విప్రో సీఈఓ కం మేనేజింగ్ డైరెక్టర్ థియర్రీ డెలాపోర్ట్ చెప్పారు. ఏఐ వంటి అత్యాధునిక టెక్నాలజీ డెవలప్ మెంట్ కోసం పెట్టుబడులు పెడుతున్నామని టీసీఎస్ ప్రకటించిన వారం రోజులకే విప్రో.. ‘ఏఐ360 విప్రో’ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడం ఆసక్తికర పరిణామం. అంతే కాదు. 25 వేల మంది ఇంజినీర్లకు జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ మీద ట్రైనింగ్ ఇస్తామని టీసీఎస్ ప్రకటిస్తే.. వచ్చే ఏడాది కాలంలో ఆర్టిషిఫియల్ ఇంటెలిజెన్స్ టూల్‌ను సమర్థవంతంగా వాడుకునేందుకు 2.5 లక్షల మంది ఉద్యోగులకు ప్రత్యేక శిక్షణ ఇస్తామని థియర్రీ డెలాపోర్ట్ తెలిపారు. ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రత్యేకించి జనరేటివ్ ఏఐ శరవేగంగా ముందుకు సాగుతున్న టూల్..అన్ని కంపెనీలు సంప్రదాయ బద్ధ విధానాల నుంచి మళ్లాల్సి ఉందని మేం అంచనా వేస్తున్నాం’ అని థియర్రీ డెలాపోర్ట్ చెప్పారు. ‘న్యూ బిజినెస్ మోడల్స్, న్యూ వేస్ ఆఫ్ వర్కింగ్, న్యూ చాలెంజెస్ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. విప్రో ఏఐ360 ఎకోసిస్టమ్ ఏర్పాటు చేయడానికి కారణం ఇదే. ఏఐ ఆపరేషన్స్ మా ఏఐ వర్క్‌లో కీలకం. మా ఆపరేషన్స్, ప్రక్రియల్లో ప్రతిభావంతులకు సాధికారత కల్పించాలి’ అని థియర్రీ డెలాపోర్ట్ వెల్లడిరచారు.
తప్పక చదవండి
-Advertisement-