- వినతి పత్రం సమర్పించిన కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్.
- చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్ డివిజన్లోని పలు సమస్యలపై ఐటి మరియు మున్సిపల్ శాఖ మంత్రివర్యులు కేటీఆర్ గారిని కలిసి బిలేటెడ్ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, చిల్కానగర్ డివిజన్లోని నార్త్ కళ్యాణ్ పూరి కాలనీ లేఅవుట్ ని ఓపెన్ స్పేస్ జోన్ నుండి రెసిడెంటిల్ జోన్ కి మార్చినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ, జోన్ మార్పిడి లో భాగంగా 1 కోటి 42 లక్షల రూపాయలు కట్టాల్సిందిగా జీవో కాపీలో ఉండడం, దాన్ని 50 శాతానికి కుదించాల్సిందిగా కేటీఆర్ గారిని కోరడం జరిగింది, వారు సానుకూలంగా స్పందిస్తూ కచ్చితంగా రుసుము తగ్గించే ఏర్పాటు చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పలు రోడ్లు మరియు సీవరేజ్ లైన్లో బాగా దెబ్బతిన్నాయని వాటి మరమ్మతుకు వెంటనే నిధులు కేటాయించాలని కేటీఆర్ గారిని కోరినట్టు కార్పొరేటర్ గీతా ప్రవీణ్ గారు తెలిపారు. అదే విధంగా కేటీఆర్ ఉప్పల్ పర్యటనలో భాగంగా వచ్చిన సందర్భంలో చిల్కానగర్ డివిజన్ కి 50 పడకల ఆసుపత్రిని మరియు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ కొరకు ఇచ్చిన వినతిపత్రం ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ, సాంక్షన్ చేయాల్సిందిగా కోరినట్టు కార్పోరేటర్ బన్నాల గీత ప్రవీణ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బీ.ఆర్.ఎస్. పార్టీ సీనియర్ నాయకులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, ఎద్దుల కొండల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కోకొండ జగన్, బాణాల నారాయణరెడ్డి, మహమూద్, శ్యామ్, బాలు మొదలగువారు పాల్గొన్నారు.
తప్పక చదవండి
-Advertisement-