Friday, May 3, 2024

తెలంగాణ ఫిలిం ఇండస్ట్రీకి తోడుగా ఉంటా

తప్పక చదవండి
  • మినిస్టర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

తెలంగాణలో కొత్త ప్రభుత్వం వచ్చింది. దీంతో సినీ పరిశ్రమకి కొత్త మంత్రి కూడా వచ్చారు. తెలంగాణ కొత్త సినిమాటోగ్రఫీ మంత్రిగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భాద్యతలు తీసుకున్నారు. మంగళవారం కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులతో అధ్యక్షులు డాక్టర్ ప్రతాని రామకృష్ణ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిసి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పలు సమస్యలు తెలియజేశారు.

ఈ సందర్భంగా మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ… తెలంగాణ ఏర్పాటు కోసం నేను మంత్రి పదవినే త్యాగం చేశాను. అలాంటి తెలంగాణలో ఫిలిం ఇండస్ట్రీ బాగుండాలని కోరుకుంటున్నాను. 24 శాఖలలో ఉన్న సినీ వర్కర్స్ ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా చేసి పెడతాను.. ఇందిరమ్మ రాజ్యంలో మీ ఫిలిం ఇండస్ట్రీకి తప్పకుండా సపోర్టుగా నేను, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎల్లవేళలా సిద్ధంగా ఉంటామని భరోసా ఇచ్చారు. మా సహకారంతో హైదరాబాద్ లో ఫిల్మ్ ఇండస్ట్రీని అభివృద్ధిలో నడిపించండి త్వరలో మీతో మళ్ళీ ఒకసారి కలిసే అన్ని విషయాలు చర్చించుకుందాం అన్నారు. తెలంగాణ ఫిలిం ఛాంబర్ చైర్మన్ డాక్టర్ ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ… మినిస్టర్ ని కలిసి అభినందనలు తెలిపి సినీ పరిశ్రమలో ఉన్న సమస్యల గురించి వివరించామన్నారు. దానికి వారు సానుకూలంగా స్పందించి మీ సమస్యలను తీర్చడానికి నేను సిద్ధంగా ఉంటాను.. మీరు ఎప్పుడైనా రావచ్చు అని హామీ అన్నారు. మేము మళ్లీ ఒకసారి మంత్రిని కలిసి మాకు ఉన్న సమస్యలన్నీ వివరించాలనుకుంటున్నాము. మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ని కలిసిన వారిలో తెలంగాణ ఫిలిం ఛాంబర్ వైస్ చైర్మన్ గురు రాజ్, జె.వి.ఆర్ కోటేశ్వరరావు, సెక్రటరీ కాచం సత్యనారాయణ, స్టూడియో సెక్టార్ చైర్మన్ చారి, డైరెక్టర్ సముద్ర, ప్రేమ్, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు