తెలంగాణా ప్రజలు సంబరంగా అంబరాన్ని తాకేలా జరుపుకుంటున్నారు..
ఈ విజయం కెసిఆర్ ముందు చూపు వల్ల మాత్రమే సంభవించింది, రభుత్వానికి భారం అయినా రైతులకు, ప్రజలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్టం తెలంగాణా ఒక్కటే… 2140 యూనిట్లతో తలసరి విద్యుత్ వినియోగంలో దేశ సగటు కన్నా 70 శాతం అధికం.. ఎంత ఎక్కువ వినియోగాన్ని ఐనా తట్టుకునేంతగా గ్రిడ్ సామర్ధ్యం, విద్యుత్ సరఫరా, పంపిణి వ్యవస్థల బలోపేతం, అట్లాగే వ్యవసాయరంగానికి నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా, ఇన్వర్టులు, జనరేటర్లు బాధ తప్పింది.. ఆంధ్ర ఇతర రాష్ట్రాల నుండి కూడా తెలంగాణాలో హైదరాబాద్, రామప్ప, యాదగిరిగుట్ట, కొండగట్టు, కేబుల్ బ్రిడ్జ్ ఇతరత్రా స్థలాలు పర్యటిస్తూ సుందర రమణియ కట్టడాలను వీక్షించడానికి వేసవిలో తెలంగాణాలో హాలిడే ట్రిప్ వేసుకుంటున్నాం అని చెప్పడం తెలంగాణా రాష్ట్రానికి గర్వకారణం.. తెలంగాణాలో 24గంటలు విద్యుత్ ఉండడం ముఖ్య కారణం కెసిఆర్ ప్రభుత్వం సాధించిన ఘనతనే కదా… అన్నారు గుండ్రాతి శారదాగౌడ్.. బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకురాలు, రాష్ట్ర అధ్యక్షులు బీసీ మహిళా సంక్షేమ సంఘం. ఈ కార్యక్రమంలో రజిత, రాజు, ఎల్లమ్మ మొదలైన వాళ్ళు పాల్గొన్నారు…