Sunday, April 28, 2024

ప్రాంత సత్సంగ వికాస వర్గ సమరోప్..

తప్పక చదవండి

జడ్చేర్లలో రెండు రోజుల వికాస వర్గ జరిగినది.. ఈ వర్గ ముగింపు కార్యక్రమంలో తెలంగాణ ప్రాంత సంఘటన మంత్రి ముడుపు యాదిరెడ్డి మాట్లాడుతూ.. దేశమును, ధర్మము, సంస్కృతిని సత్సంగము ద్వారా సమాజంలో సంస్కారము, క్రమశిక్షణను నిర్మాణం చేయాలని.. వీహెచ్పీ సత్సంగం గ్రామ గ్రామాన, సమితి ఆధారంగా గ్రామంలో చైతన్యము, గ్రామ యువకులలో జాగరణ, మహిళలలో చైతన్యము తీసుకురావాలని.. ప్రస్తుత కాలమాన పరిస్థితులలో హిందువుల ఐక్యత, హిందూ జాగరణ అవసరం అని.. ధర్మరక్షణ కొరకు శ్రీరాముడు ఏవిధంగా పనిచేసాడో.. ఆ విషయాలని గుర్తు చేశారు. కార్యకర్తలు సమయమిచ్చి పనిచేసే విధంగా వీ.హెచ్.పీ. సమితి అత్యవసరమని అని తెలియజేసారు. రాబోయేటువంటి సంవత్సరంలో అయోధ్యలో భవ్య మందిర నిర్మాణం పూర్తవుతుందని, మందిర నిర్మాణం సమాజంలో స్వాభిమాన నిర్మాణం చేయాలని, మందిరం కేంద్రంగా గ్రామాల్లో చేయాలని పిలుపునిచ్చారు.. ఈ కార్యక్రమంలో అఖిల భారతీయ కార్యకారిని సదస్సులు రాఘవులు, జిల్లా కార్యధ్యక్షుడు బుచ్చారెడ్డి, ప్రాంత సత్సంగ ప్రముఖ్ వాసు, ప్రాంత సహ కార్యదర్శి రాజేశ్వర్ రెడ్డి, క్షేత్ర సేవా ప్రముఖ్ బండారు రమేష్, జదీశ్వర్ పాల్గొన్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు