Wednesday, May 22, 2024

ప్రార్థించే పెదవులు కన్నా సహాయం చేసే చేతులు మిన్న…

తప్పక చదవండి

ఎమ్మెల్సీ నవీన్ జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకొని గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా సరస్వతి పుత్రిక చరిత శ్రీ కు లాప్టాప్ బహూకరించారు టి.ఎస్.టి.ఎస్. చైర్మన్ పాటీమీద జగన్మోహన్ రావు.. రామన్న మదిలో మెదిలిన ఆలోచన కనుగుణంగా రామన్న జన్మదిన సందర్భంగా చేపట్టిన బృహత్ కార్యక్రమం గిఫ్ట్ ఏ స్మైల్
ఈ కార్యక్రమంలో భాగంగా సోమవారం రోజు ఎమ్మెల్సీ నవీన జన్మ దినోత్సవం సందర్భంగా కూకట్పల్లి నియోజకవర్గ మలిదశ ఉద్యమకారుడు టి.ఎస్.టి.ఎస్. చైర్మన్ పాటిమీద జగన్మోహన్ రావు బేగంపేటకు చెందిన మలిదశ ఉద్యమకారుడు కే. రాజు కుమార్తె చరిత శ్రీ కి లాప్టాప్ ను బహుకరించడం జరిగినది. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ రామన్న పిలుపుతో కేసీఆర్ ఆలోచనలతో తెలంగాణ రోజు రోజుకు సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలలో దేశానికి దిక్సూచిగా నిలిచిందని, రామన్న పిలుపుతో గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ వ్యాప్తంగా నిరుపేద విద్యార్థులకు తనకు తోచిన సహాయం చేస్తున్నని తెలియజేసినారు. తదనంతరం లాప్టాప్ తీసుకున్న చరిత శ్రీ తండ్రి బేగంపేట మలిదశ ఉద్యమకారుడు రాజు మాట్లాడుతూ.. జగనన్న ఎంతో మంది యువతకు స్ఫూర్తి ప్రధాతగా నిలుస్తున్నారని, నియోజకవర్గంలో ఎంతో మంది పేద విద్యార్థులకు అండగా నిలుస్తూ.. జగన్ చేస్తున్న సేవలు అమోఘమని జగన్ కి కృతజ్ఞతలు తెలియజేశారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు