Sunday, September 8, 2024
spot_img

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారు..

తప్పక చదవండి
  • ఈ నెల 31న మంత్రి మండలి సమావేశం జరుపాలని సీఎం నిర్ణయం
  • ఆగస్టు 3 నుంచి ప్రారంభం కానున్నశాసనసభ, మండలి సమావేశాలు
  • ఈ భేటీలో ప్రధానంగా 50 అంశాలపై చర్చించనున్నట్టు తెలుస్తుంది

తెలంగాణ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారయ్యింది.ఆగస్టు 3 నుంచి రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరుగుతున్ననేపథ్యంలో ఈ అసెంబ్లీ సమావేశాలకు ప్రాధాన్యత సంతరించుకుంది. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం రోజు బీఏసీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఎన్ని రోజుల పటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. కాగా ఇటీవల రాష్ట్రాన్ని వరదలు కుదిపేసిన నేపథ్యంలో ప్రతిపక్షాలకు ఇది అస్త్రంగా మారనుంది. ప్రజల సమస్యలపై ప్రతిపక్షాలు తమ గొంతును వినిపించే అవకాశాలున్నాయి. కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారు. అయితే గత బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగం లేకుండానే జరిగాయి. అయితే ఈసారి ఇంచుమించు తమిళిసై ప్రసంగం ఉండదని అంతా భావించారు. కానీ రెండడుగులు వెనక్కి తగ్గిన కేసీఆర్ సర్కార్ గవర్నర్ కు ఆహ్వానం పంపించడం, తమిళిసై బడ్జెట్ కు ఆమోదం తెలపడం చక చక జరిగిపోయాయి .

తెలంగాణ కేబినెట్ భేటీక.. ఏకంగా 50 అంశాలపై చర్చ :
ఈ నెల 31న మంత్రి మండలి సమావేశం కావాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. తెలంగాణ నూతన సచివాలయంలో మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ సమావేశం జరుగనుంది. ఈ భేటీలో ప్రధానంగా 50 అంశాలపై చర్చించనున్నట్టు తెలుస్తుంది. ఇటీవల రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదలు, ప్రభావిత ప్రాంతాలు, ఆయా పరిస్థితులపై కేబినెట్ లో చర్చ జరగనుంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు