Friday, May 3, 2024

ఫవర్ ప్యాక్డ్ పవర్ స్టార్ పవర్ ఫుల్ మూవీ ” బ్రో “

తప్పక చదవండి

పవన్ ఫ్యాన్స్ కు షడ్రుచుల విందు అందించింది బ్రో మూవీ.. మామకు తగ్గ అల్లుడిగా సాయి ధరమ్ తేజ్ పోటీ పది నటించడం విశేషం.. జూలై 28 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన బ్రో మూవీ హిట్ టాక్ తో దూసుకుని పోతోంది.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్, కేతిక శర్మ, ప్రియా ప్రకాష్, బ్రహ్మానందం, సుబ్బరాజు, ఊర్వశి తదితరులు నటించిన బ్రో సినిమా పవన్ కళ్యాణ్ అభిమానులను ఉర్రూతలూగిస్తోంది.. ప్రేక్షకుల కేరింతలతో థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి..
దర్శకుడు సముద్రఖని ఈ చిత్రాన్ని ఆద్యంతం ఆసక్తికరంగా తెరకెక్కించారు.. నిర్మాతలు టి.జి. విశ్వా ప్రసాద్, వివేక్ కూచిబొట్ల ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చిత్రాన్ని నిర్మించారు.. మరోసారి థమన్ తన మ్యూజిక్ మ్యాజిక్ తో శ్రవణానందం కలిగించాడు.. సుజిత్ వాసుదేవ్ తన సినిమాటోగ్రఫీతో విజువల్ వండర్ ని తెరకెక్కించాడు.. నవీన్ మాలి ఎడిటింగ్ చిత్రాన్ని మరో లెవల్ కి తీసుకెళ్లింది..

పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలయికలో సముద్రఖని దర్శకత్వంలో వచ్చిన ఈ బ్రో సినిమా రాక కోసం పవర్ స్టార్ అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఆ ఆసక్తిని రెట్టింపు చేస్తూ ఈ చిత్రం ఈ రోజు అత్యధిక థియేటర్లలో విడుదల అయింది.

- Advertisement -

స్థూలంగా సినిమా కథ ఒకసారి చూద్దాం.. మార్కండేయ (సాయి ధరమ్ తేజ్) వర్క్ కి తప్ప మిగిలిన వ్యక్తులకు టైం లేదంటూ ఎప్పుడూ బిజీగా ఉంటాడు. లైఫ్ లో ఎదగడానికి చాలా కష్ట పడతాడు. తన కంపెనీలో మంచి పొజిషన్ కి వెళ్తాడనుకునే సమయంలో మార్కండేయ ఒక యాక్సిడెంట్ లో చనిపోతాడు. అప్పుడే టైమ్ గాడ్ (పవన్ కళ్యాణ్) మార్కండేయ లైఫ్ లోకి ఎంట్రీ ఇస్తాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో మార్కండేయ తిరిగి బతికాడా ? లేదా ? ఒకవేళ బతికితే టైమ్ గాడ్ (పవన్ కళ్యాణ్) అతనికి ఎన్ని డేస్ టైమ్ ఇచ్చాడు? ఈ మధ్యలో మార్కండేయ లైఫ్ లో జరిగిన సంఘటనలు ఏమిటి? చివరకు మార్కండేయ అర్థం చేసుకున్న అంశం ఏమిటి? అలాగే అతని జీవితం చివరికి ఎలా ముగిసింది? అనేది తెరమీద చూస్తే బావుంటుంది.. .

పవర్ స్టార్ ఫ్యాన్స్ కు ఏం కావాలో అవన్నీ ఒక సినిమాలో పెట్టి తీసిన సినిమా ఇది. పవన్ ఫ్యాన్స్ కి ఈ సినిమా ఫుల్ కిక్ ఇస్తోంది. పవన్ కళ్యాణ్ తన స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటు తన మార్క్ టైమింగ్‌ తో కూడా ఈ సినిమాకి హైలెట్ గా నిలిచారు. తన పాత్రలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ ఎప్పటిలాగే పవన్ తన మ్యాజరిమ్ తాలూకు పెర్పార్మెన్స్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. ప్రధానంగా సినిమాలో పవన్ ఎంట్రీ సీన్స్, ఇంటర్వెల్ సీక్వెన్స్, అలాగే క్లైమాక్స్, ముఖ్యంగా పవన్ డైలాగ్స్ చాలా బాగున్నాయి. ఈ సినిమాలో మరో హీరోగా నటించిన సాయి ధరమ్ తేజ్ కూడా నటన పరంగా ఆకట్టుకున్నాడు. కొన్ని ఏమోషనల్ సీన్స్ లోనూ తేజ్ చాలా బాగా నటించాడు. హీరోయిన్ కేతిక శర్మ కూడా తన గ్లామరస్ పెర్ఫార్మెన్స్‌తో బాగానే నటించింది. అలాగే తల్లి పాత్రలో సీనియర్ నటి రోహిణి నటించిన విధానం ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో ఆమె నటన చాలా బాగుంది. మరో పాత్రలో నటించిన ప్రియా ప్రకాష్ వారియర్ కూడా తన పాత్రకు తగ్గట్లు చాలా బాగా చేసింది. కామెడీ కింగ్ బ్రహ్మానందం తన కామిక్ హావభావాలతో నవ్విస్తూనే.. పవన్ గురించి చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్స్ బాగున్నాయి. సుబ్బరాజు, ఊర్వశి రౌతేలా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు. అదేవిధంగా మిగిలిన నటీనటులు కూడా అయా పాత్రల్లో తమ నటనతో ఆకట్టుకున్నారు. ఇక కామెడీని హ్యాండిల్ చేయడంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న త్రివిక్రమ్ తనదైన ప్లేతో, తన మార్క్ డైలాగ్ లతో కొన్ని చోట్ల ఆకట్టుకున్నారు.

రచయితగా త్రివిక్రమ్ – దర్శకుడిగా సముద్రఖని గుడ్ పాయింట్ తో పాటు డీసెంట్ ఎమోషన్స్, కొన్ని ఫన్ మూమెంట్స్ తో ఆకట్టుకున్నప్పటికీ.. అలాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో మంచి పనితీరుని కనబర్చినప్పటికీ.. కథనం విషయంలో మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయారని చెప్పవచ్చు.. దీనికితోడు పవన్ ఫ్యాన్స్ ను మాత్రమే దృష్టిలో పెట్టుకునే డిజైన్ చేసిన సీన్స్ అండ్ సాంగ్స్ కూడా సాధారణ ప్రేక్షకులకు పెద్దగా కనెక్ట్ కావు. అలాగే పవన్ చెప్పే డైలాగ్స్ కూడా మాస్ ఆడియన్స్ కి పెద్దగా ఎక్కవు. కానీ, పవన్ ఫ్యాన్స్ కి మాత్రం ఫుల్ కిక్ ఇస్తాయి.

సాంకేతిక విభాగం విషయానికి వస్తే.. సముద్రఖని దర్శకుడిగా ఆకట్టుకున్నా.. పూర్తిస్థాయిలో మెప్పించలేకపోయారు. త్రివిక్రమ్ కూడా తన కథనాన్ని ఇంకా ఆసక్తికరంగా మలిచి ఉంటే బాగుండేది. సంగీత దర్శకుడు థమన్ ఎస్ సమకూర్చిన పాటలు ఆడియో పరంగా కంటే కూడా.. సినిమాలో విజువల్ గా పరంగా బాగున్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా బాగుంది. థమన్ నేపధ్య సంగీతం కూడా బాగుంది. అలాగే సినిమాటోగ్రఫీ వర్క్ కూడా బాగుంది. సినిమాలోని సన్నివేశాలన్నీ కథకి అనుగుణంగా చాలా అందంగా చిత్రీకరించారు. నిర్మాతలు టి.జి.విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. వారి నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి.

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఈ బ్రో సినిమా ఫుల్ కిక్ ఇస్తోంది. సినిమాలో గుడ్ మేసేజ్ తో పాటు డీసెంట్ ఎమోషన్స్ అండ్ కొన్ని చోట్ల ఫన్ ఎలిమెంట్స్ ఆకట్టుకున్నాయి. పవర్ స్టార్ తన నటనతో, తన డైలాగ్ మాడ్యులేషన్ తో, మ్యానరిజమ్స్ తో ఈ సినిమాని మరో లెవల్ కి తీసుకు వెళ్లారు. ఓవరాల్ గా ఈ బ్రో చిత్రం పవన్ ఫాన్స్ ను మాత్రం చాలా బాగా ఆకట్టుకుంటుంది.

రివ్యూ బై : బీవీఆర్ రావు..
ఆదాబ్ రేటింగ్ : 3.5/5.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు