Saturday, July 27, 2024

ఛత్తీస్ ఘడ్ లో తీన్మార్ మల్లన్నకు ఘన స్వాగతం..

తప్పక చదవండి
  • సుదీర్ఘ ప్రయాణంలో ఛత్తీస్ ఘడ్ చేసుకున్న వైనం..
  • అక్కడి ప్రభుత్వం సాధించిన ఘనతపై అధ్యయనం..
  • రైతులకు, మహిళలకు ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వం కల్పిస్తున్న
    ప్రయోజనాలు ఎంతో గొప్పగా ఉన్నాయి : మల్లన్న

ఛత్తీస్ ఘడ్, 14 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :
తెలంగాణలో రాష్ట్రంలో దొర పాలనకు దగాపడ్డ రైతులకు చతిస్గడ్ రైతులు మల్లన్నతో కలిపి ఘన స్వాగతం పలికారు. తెలంగాణ రాష్ట్రం నుండి దాదాపు 1500 కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణంతో చేరుకున్న తెలంగాణ రైతులకు అక్కడి స్థానిక రైతులు మల్లన్న ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. ఛత్తీస్ ఘడ్ లో రైతుల వ్యవసాయ విధానంపై సమగ్ర సహకారం, పండించిన పంటకు మద్దతు ధర కల్పించడంలో ఇక్కడి ప్రభుత్వం గణనీయమైన ప్రగతిని సాధించింది. ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో ఇక్కడ ప్రభుత్వం, మహిళా సంఘాలకు, మహిళ రైతు సహకార సంఘాలకు, ఐ యాం సమృద్ధి సంఘాలుగా ఏర్పాటు చేసి, నేరుగా ప్రభుత్వ నిధులతో, రైతు కుటీర పరిశ్రమలు ఏర్పాటుచేసి రైతులకు ప్రోత్సాహకాలం ఇస్తుందని మల్లన్న తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం రైతులను మోసంచేస్తూ ఉచిత పథకాల పేరుతో దగా చేస్తుందని, ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వం రైతుల నుండి పశువుల పేడను రెండు రూపాయల కిలో చొప్పున కొనుగోలు చేసి ఆర్థిక స్వావలంబనకు కృషి చేస్తుందని మల్లన్న పేర్కొన్నారు.. కానీ మన తెలంగాణ ప్రభుత్వం రైతుల భూములను దౌర్జన్యంగా గుంజుకుంటుందని మల్లన్న నిప్పులు చెరిగారు. ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వం రైతులు పండించిన పంటను 12 క్వింటాలే కొంటుందని అబద్ధపు పలుకులు పలుకుతూ.. తెలంగాణ రైతులకు, మోస పూరితంగా తప్పుడు వాగ్దానాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ పండించిన పంటకు కనీస మద్దతు ధర రైతులను ఆదుకుంటుందని తెలిపారు.

రూపేష్ బగేల్ ప్రభుత్వం రైతుల పట్ల ఉదారమైన భావంతో.. స్వయం సహకార సంఘాలుగా ఏర్పాటుచేసి, రైతులకు ఆర్థిక సహకారం అందిస్తుందని మల్లన్న తెలిపారు. ఏర్పాటు చేసిన కోళ్లు, మేకలు, పశువుల పెంపకందారులకు, ప్రోత్సాహకాలను అందిస్తూ.. వాటి ద్వారా వచ్చిన పేడను నేరుగా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ఇక్కడ రైతులు తెలిపారు. భూపేష్ బగేల్ ప్రభుత్వం రైతులకు రుణ మాఫీని ఒక లక్ష నుండి పది లక్షల వరకు చేస్తుందని మల్లన్నకు రైతులు వివరించారు. ఛత్తీస్ ఘడ్ రైతులకు పంటలకు కనీస మద్దతు ధర కల్పిస్తూ, భూమి లేని రైతులకు ప్రతి ఎకరాకు ఏడు వేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తుందని పేర్కొన్నారు. ఛత్తీస్ ఘడ్ భూపేష్ భగిల్ ప్రభుత్వం నిరుద్యోగ యువతీ యువకులకు, రూ. 2500 రుణభృతి అందిస్తుందని తెలిపారు. పశువుల వ్యర్ధాల వల్ల ఉపాధి మార్గాలు పొందుతున్నారని పేర్కొన్నారు. ఇక్కడ ప్రభుత్వం రైతులు పండించిన పంటకు కనీస మద్దతు ధరనిస్తూ.. ఎన్నో క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని తెలిపారు. వాణిజ్యతర పంటలకు నేరుగా రైతులకు ఎకరాకు రూ. 10000 ఆర్థిక సాయం అందిస్తుందని పేర్కొన్నారు. ఇక్కడ రైతులు చేపల పెంపకాలు, కోళ్ల పెంపకాలు ఉచిత కరెంటుతో పాటు, బ్యాంకు రుణ సాయాలు అందిస్తుందని తెలిపారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు