Thursday, September 12, 2024
spot_img

నూతన విద్యా విధానం వల్లే ప్రాంతీయ భాషల్లో టెక్నికల్‌ కోర్సులు

తప్పక చదవండి

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకవచ్చిన జాతీయ నూతన విద్యా విధానం-2020 ప్రకారం అట్టడుగు వర్గాలకు చెందిన విద్యార్థులు సాంకేతిక విద్యలో ప్రత్యేకమైన కోర్సులని మాతృ భాష లేదా ప్రాంతీయ భాషల్లో విద్యను అభ్యసించడాన్ని ప్రోత్సహిస్తుంది. భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశానికి ఇటువంటి అనువైన విధానాలను అమలు చేయడం అంత సులభం కాదు, మొదట్లో ప్రాంతీయ భాషల్లో సాంకేతిక విద్యా బోధనకు వ్యతిరేకంగా కొన్ని విద్యాసంస్థల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఏది ఏమైనప్పటికీ, అసమానతలు ఉన్నప్పటికీ మన దేశంలో ఉన్న కొన్ని ఇంజినీరింగ్‌ విద్యా సంస్థలు స్థానిక భాషల్లో సాంకేతిక కోర్సులు అందుబాటులోకి తెచ్చాయి. గతంలో భారతదేశంలోని అటల్‌ బిహారీ వాజ్‌పేయి హిందీ విశ్వవిద్యాలయం, అన్నావిశ్వవిద్యాలయం ఇంజనీరింగ్‌ వంటి సాంకేతిక విద్య కోసం ప్రాంతీయ భాషా కోర్సులను ప్రవేశపెట్టడా నికి ప్రయత్నించాయి. కానీ విజయవంతంగా అమలు చేయలేకపోయాయి. ఎందుకంటే చదువుకోవడానికి అవసరమైన మెటీరియల్‌ చాలా వరకు ఇంగ్లీష్‌ లో ఉంది. ఇది విద్యార్థులకు అనేక సమస్యలను కలిగించింది. ఈ సమస్యను ఎదుర్కోవడానికి, ఇంజినీరింగ్‌ అధ్యయనానికి సంబంధించిన విషయ పరిజ్ఞానం ప్రాంతీయ భాషల్లోకి అనువదించే ప్రయత్నాన్ని ఆల్‌ ఇండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ చేస్తుంది. భారతదేశంలో ఎక్కువ సంఖ్యలో వృత్తిపరమైన కోర్సులు ఆంగ్లంలో బోధించబడుతు న్నాయి. సైన్స్‌, ఇంజినీరింగ్‌, వైద్య, న్యాయ శాస్త్రాల భోధన స్థానిక భాషలో ఆచరణాత్మకంగా లేవు. ఎక్కువ మంది విద్యార్థులు స్థానిక భాషలలో ఉన్నత విద్యను అభ్యసించడానికి అతిపెద్ద అడ్డంకులలో సాంకేతిక కోర్సులలో నాణ్యతను కలిగిన పాఠ్యపుస్తకాలు అందుబాటులో లేకపోవడం ప్రధాన అంశంగా కనబడుతున్నది. స్కూల్‌ స్థాయి నుండి ఉన్నత విద్య స్థాయి వరకు బోధన, పుస్తకాలు ప్రాంతీయ భాషలో అందుబాటులో తేవడం ప్రపంచ వ్యాప్తంగా ఉంది. ప్రపంచంలో పలు దేశాలలో పాఠశాల స్థాయి నుండి కళాశాల స్థాయి వరకు అన్ని రకాల కోర్సులని స్థానిక భాషల్లోనే అందిస్తున్నాయి. జి-20 దేశాలలో చాలా దేశా లు అత్యాధునిక విశ్వవిద్యాలయాలను కలిగి ఉన్నాయి. వీటిలో విద్యార్థులకు వారి ఆధిపత్య భాష బోధన అందించబ డుతుంది. దక్షిణ కొరియాలో దాదాపు 70 శాతం విశ్వవిద్యాల యాలు కొరియన్‌లో బోధించబడుతున్నాయి. దక్షిణ కొరియా ప్రభుత్వం పాఠశాలలు కొరియన్‌ భాషలో విద్యార్థుల ప్రావీణ్యం మందగిం చినందున 2018లో మూడవ తరగతికి ముందు ఇంగ్లీష్‌ బోధించ డాన్ని నిషేధించింది. జపాన్‌లో అత్యధిక విశ్వవిద్యాలయ కార్యక్ర మాలు జపనీస్‌లో బోధిస్తున్నారు. చైనాలో విశ్వవిద్యా లయాలు మాండరిన్‌ని బోధనా మాధ్యమంగా ఉపయోగిస్తున్నారు. ఫ్రాన్స్‌ దేశం బోధనా మాధ్యమంగా ‘ఫ్రెంచ్‌-మాత్రమే’ అనే విధానాన్ని అమలు చేస్తున్నారు. జర్మనీ దేశంలో తృతీయ విద్యలో కూడా అన్ని మాస్టర్స్‌ ప్రోగ్రామ్‌లు 80% కంటే ఎక్కువ జర్మన్‌ భాషలోనే బోధించబడుతున్నాయి. నేడు నూతన విద్యా విధానం, విద్యా వ్యవస్థను విదేశాలలో ఉన్న వ్యవస్థలా మరింత సరళంగా, ఓపెన్‌ గా మార్చడం ద్వారా కొన్ని మార్పులని చేసింది. అదనంగా సాంకే తిక విద్యను సాధారణ ఉన్నత విద్యా పాఠ్యాంశాలతో విలీనం చేయడం ద్వారా ప్రయోగాత్మక అను భవాన్ని పొందడానికి ఈ ప్రోగ్రామింగ్‌ భాషలను ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఉపయోగించవచ్చో అర్థం చేసుకోవడంలో సహాయపడే కోర్సును రూపొందించడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడిరది. ఇవి స్వయంచాలక వాతావరణా న్ని నిర్మించడానికి ఈ సాంకేతిక యుగంలో విద్యార్ధులు వారి ఆసక్తి గల రంగంలో తమ కెరీర్‌ను నిర్మించుకోవవడంలో సహాయపడతాయి. 2021వ సంవత్సరంలో నూతన విద్యా విధానానికి అనుగుణంగా దేశంలోని 14 ఇంజినీరింగ్‌ కాలేజీలు ప్రాంతీయ భాషల్లో బోధించేందుకు ముందుకొచ్చాయి. 14 ఇన్‌స్టిట్యూట్‌లలో దాదాపు సగం కాలేజీలు హిందీలో టెక్నికల్‌ కోర్సులను అందిస్తున్నారు. వాటిలో ఉత్తర ప్రదేశ్‌ నుంచి నాలుగు, రాజస్థాన్‌ నుంచి రెండు, ఉత్తరాఖండ్‌ నుంచి ఒకటి, మద్యప్రదేశ్‌ నుంచి ఒకటి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌, తమిళనాడులో తెలుగు, మరాఠీ, బెంగాలీ, తమిళంలో కోర్సులను అందిస్తున్నాయి. సమర్థవంత మైన బోధనను పెంపొం దించడానికి వీలైనంత వరకు మాతృభాష లో ఇంజనీరింగ్‌ కోర్సులను అందించాలని ఆల్‌ ఇండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ (AIజుజు) నిర్ణయించింది. ఆ తర్వాత 20 పైగా కాలేజీలు ప్రాంతీయ భాషలో సాంకేతిక విద్యను అందిచటానికి ముందుకు వచ్చాయి. ఈ విధానం సమాజంలోని అట్టడుగు వర్గాలకు మరింత ఉపయోగకరంగా ఉంటుందని, వారికి మెరుగైన ఉపాధి అవకాశాలను అందిస్తుంది, వారిని మరింత స్వావలంబనగా చేస్తుందని భావించింది. 2021 నుండి ఇంజనీరింగ్‌ కోర్సులు 11 భాషలలో (హిందీ, మరాఠీ, తమిళం, తెలుగు, కన్నడ, గుజరాతీ, మలయాళం, బెంగాలీ, అస్సామీ, పంజాబీ, ఒరియా) అందించబడతాయి. మొదట్లో ఎంపిక చేసిన ఇంజనీరింగ్‌ బ్రాంచ్‌లకు AIజుజు అనుమతిని మంజూరు చేసింది. వాటిలో ఎక్కువ భాగం కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ తర్వాత ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌, సివిల్‌ ఇంజనీరింగ్‌, మెకానికల్‌ ఇంజనీరింగ్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీకి సంబంధించినవి ఉన్నాయి. ఐఐటీలు, ఎన్‌ఐటీలు కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తాయని, త్వరలో ప్రాంతీయ భాషల్లో అన్ని సాంకేతిక కోర్సులను కూడా అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం ప్రాంతీయ భాషా అధ్యయనాలకు అందుబాటులో ఉన్న కొన్ని సాంకేతిక కోర్సులు కంప్యూటర్‌ సైన్స్‌, ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్‌, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌, మెకానికల్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మరియు సివిల్‌ ఇంజనీరింగ్‌, ఈ కోర్సులు అధిక సంఖ్యలో ఇంజనీరింగ్‌ అడ్మిషన్‌ సీట్లను కలిగి ఉంటాయి. కాబట్టి వాటిని ప్రాంతీయ భాషల్లో అం దుబాటులో ఉంచడం వల్ల భారతదేశంలో ఇంజనీరింగ్‌కి మరింత జనాదరణ పొందుతుంది. అలాగే వివిధ విద్యా నేపథ్యాల నుండి వచ్చిన విద్యార్థులందరికీ సమాన అవకాశాన్ని అంది స్తుంది. 2022లో మధ్యప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం వీదీదీూ మొదటి సంవత్స రానికి సంబంధించిన మూడు పుస్తకాలని హిందీలో అనువదిం చారు. సాంకేతిక విద్యలో బోధన, కోర్సు మెటీరియల్‌ వంటివి స్థానిక భాషలోనే అందిస్తే విద్యార్ధులకు, ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంత విద్యార్ధులకు నిర్దిష్ట భావనలను బాగా అర్థం చేసుకోవడా నికి సులుభంగా అర్ధమయ్యే అవకాశం ఉంది. కొంతమంది విద్యార్ధులు ఇంగ్లీష్‌ మాట్లాడే నైపుణ్యాలు, అత్యుత్తమ ప్రతిభను వెలికి తీయడానికి, విదేశీ భాషను అర్థం చేసుకోవడంలో విఫలమై నందున సాంకేతిక నైపుణ్యాలలో ఉన్నత విద్యను అభ్యసించాల నుకునే వారి కోరిక నేరవేరడానికి కుడా ఉపయో గపడుతుంది. సాంకేతిక విద్యలో ప్రాంతీయ భాషలలో బోధన, వ్యక్తులలో నైపుణ్యాన్ని పెంచడంలో సహాయపడుతుంది. సాంకేతిక విద్య ద్వారా ఒక వ్యక్తిని ఉపాధి పొందేలా చేయడం కొంత మేరకు నిరుద్యోగాన్ని నిర్మూలించడంలో సహాయపడుతుంది. ఉదాహరణ కు అమెజాన్‌ లాంటి ఈ-కామర్స్‌ ప్లాట్‌ఫారమ్‌లో ప్రాంతీయ భాషలను ప్రవేశపెట్టినప్పుడు, డెవలపర్‌చే సృష్టించబడిన ఇ-కామర్స్‌ సైట్‌లో ప్రాంతీయ భాష ఆదరణీయంగా నడపగలి గిన ప్పుడు, ఒక వ్యక్తికి ప్రాంతీయ భాషలో అవసరమైన నైపుణ్యాలను అందించడం ద్వారా ఎక్కువ ఆర్డర్స్‌ చేయగలడు. ప్రాంతీయ భాషల్లో సాంకేతిక కోర్సుల భోధన ఆశించిన ఫలితాలు రావొచ్చని భావన కల్గవచ్చు. అయితే, ఈ రోజు మనం జీవిస్తున్న నేటి యుగం మారింది, అలాగే మన ఆసక్తులు. అందుబాటులో ఉన్న వనరులు కూడా మారాయి. కాబట్టి విద్యా ర్ధులు ఇకపై అదే పాత డిప్లొమ కోర్సులు లేదా కొన్ని యాదృచ్ఛిక వృత్తిపరమైన కోర్సులను ఎంచుకోవడానికి ఇష్టపడకపోవచ్చు. కానీ ప్రత్యేకతలను కలిగిన సాంకేతిక కోర్సులు ఆ రంగాలలో వృత్తిని సంపాదించడానికి దోహదపడవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా విస్తృతమైన కెరీర్‌ అవకాశాల గురించి అవగాహన వ్యాప్తి చెందుతోంది. కాబట్టి దానిని జోడిస్తూ, నూతన విద్యా విధానం ఇప్పుడు భాషని ఏ విధంగానూ అడ్డంకిగా ఉండనివ్వకుండా ఈ సమస్యను పరిష్కరించడానికి సహాయం చేస్తుంది. నాన్‌-ఇంగ్లీష్‌ మీడియం నేపథ్యాల నుండి వచ్చిన విద్యార్ధులు ఇప్పుడు వారు కోరుకునే ఏ కోర్సునైనా రెండవ ఆలోచన లేకుండా కొనసాగించడంలో వారి సామర్థ్యం గురించి ఎలాంటి భయం లేకుండా ఎన్నుకోవచ్చు. మాతృభాషలో బోధనపై ఒత్తిడి తీసుకురావడం సరిjైునది కాదు. కానీ ఒకరు వీలైనన్ని ఎక్కువ భాషలను నేర్చుకోవాలి, కానీ దానికి అవసరమైనది బలమైన పునాది మాతృ భాష మాత్రమే. నేటి సాంకేతిక యుగం లో ప్రజలు, ముఖ్యంగా విద్యార్థులు ఎప్పుడు ‘మాతృభాష వర్సెస్‌ ఇంగ్లీష్‌’ అనే భావన కంటే ‘మాతృభాష ప్లస్‌ ఇంగ్లీష్‌’ విధానం అనుసరిస్తే సాంకేతిక భాషల్లో స్థానిక భాషా ప్రభావం ఉంటుంది. మనం ఒక భాషను నిర్లక్ష్యం చేస్తే, అమూల్య మైన జ్ఞానాన్ని కోల్పో యే ఉంది. కాబట్టి తమ మాతృభాషలో వృత్తిపరమైన కోర్సులను అభ్యసించాలని ఆసక్తి విద్యార్ధుల్లో తీసుకురావాలి. ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాలు కుడా తప్పనిసరిగా కొన్ని ద్విభాషా కోర్సులను ప్రారంభించడానికి ప్రభుత్వంతో చేతు లు కలపాలి. AIజుజు మరియు IIు మద్రాస్‌ ఎనిమిది ప్రాంతీయ భాషలలో స్వయం కోర్సులను (ఆన్లైన్‌ కోర్సులు) అనువదించడా నికి సహ కరించా యి. ఇది ఇంజినీరింగ్‌ విద్యార్థులకు ఒక పెద్ద ప్రోత్సా హాకరం. ఉన్నత విద్యను ప్రజాస్వామ్యీకరించడానికి ఇలాంటి సాం కేతికతతో కూడిన మరిన్ని కార్యక్రమాలు అవసరం. ప్రాంతీయ భాషల్లో సాంకేతిక కోర్సులు అభ్యసించాలని విద్యార్ధుల కు ఉన్నా సరిjైున ఉపాధి, ఉద్యోగ అవకాశాలు రావనే భావనతో చాలా మంది విద్యార్ధులు ఆసక్తి చూపించటం లేదు. కానీ సరి jైున మెటీరియల్‌ అందుబాటులోకి తెచ్చి, ప్రాంతీయ అవసరా లను బట్టి పరిశ్రమలను నెలకొల్పి, గ్రామీణ, స్థానిక మార్కెట్‌ అవసరా లను దృష్టిలో పెట్టుకొని ప్రాంతీయ భాషలో సాంకేతిక విద్య అభ్యసిం చిన వారికీ ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి, ఉపాధి అవకాశాలు కల్పిస్తే ప్రాంతీయ భాషలో సాంకేతిక విద్యా ప్రవేశాల నమోదు పెరుగుతుంది, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇందుకు కావాల్సిన చర్య లు తీసుకుంటే సత్ఫలితాలు వస్తాయని మేధావుల అభిప్రాయం. కేంద్ర ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానం అమలుపై పలు నూతన సంస్కరణలు ప్రవేశ పెట్టి విద్యా వ్యవస్థ లో గుణాత్మక మార్పుల కోసం కృషి చేస్తున్న తీరు హర్షణీయం.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు