Monday, October 14, 2024
spot_img

విమర్శలకు దారితీస్తున్న జిల్లా పోలీసుల తీరు..

తప్పక చదవండి
  • మంత్రిని పొగడ్తలతో ముంచెత్తిన జిల్లా ఎస్పీ.
  • విద్యార్థులతో కలిసి తీన్మార్ స్టెప్పులేసిన సిఐ.సోమ్ నారాయణ సింగ్.
  • జిల్లా పోలీస్ ల తీరుతో ప్రజల్లో నవ్వుల పాలు..
  • తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సూర్యాపేట
    జిల్లాలో చోటు చేసుకున్న సంఘటన..

సూర్యాపేట, 12 జూన్ (ఆదాబ్ హైదరాబాద్) :
నిత్యం బిజీగా ఉండే పోలీసులు స్టూడెంట్స్ తో కలిసి స్టెప్పులు వేసిన సంఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలో చేటుచేసుకుంది. పూర్తి వివరాలలోకి వెళ్తే.. జిల్లా కేంద్రంలో సోమవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ నుండి సద్దల (మినీ ట్యాoక్ బండ్) చెరువు వరకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 2కె నిర్వహించారు. మంత్రి జగదీష్ రెడ్డి జెండా ఊపి కార్యక్రమం ప్రారంభించగా, జిల్లా అధికారులు, బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు, విద్యార్థులు, యువత, పోలీస్ లు భారీగా పాల్గొన్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన స్టేజిపై జిల్లా ఎస్పీ మాట్లాడుతూ మంత్రి జగదీష్ రెడ్డిని పొగడ్తలతో ముంచెత్తాగా, సూర్యాపేట రూరల్ సిఐ సోమ్ నారాయణ సింగ్ డీజే టిల్లు అంటూ కుర్రకారుతో స్టెప్పులు వేసి యువతను ఉర్రూతలూగించారు.. తనలో ఉన్న మంచి డాన్సర్ ని బయటకి తీసి, విద్యార్థులతో కలిసి డి.జే టిల్లు, తీన్మార్ పాటలకు ఫేస్ లో హవాభావాలు పండిస్తూ
ఆదిరేటి స్టెప్పులు వేశారు. జిల్లా పోలీస్ అధికారి గతంలో కూడా జయహో మంత్రి జగదీష్ రెడ్డి అంటూ నినాదాలు చేసిన విషయం తెలిసిందే. ప్రజలకు సేవ చేయాల్సింది పోయి నాయకులకు జేజేలు కొట్టడం, ప్రజా ప్రతినిధులను పొగడ్తలతో ముంచేతడం వల్ల ప్రజల్లో నవ్వుల పాలవుతున్నారు. పోలీస్ ల తీరుపై జిల్లా వ్యాప్తంగా విమర్శలు గుప్పుమంటున్నాయి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు