Saturday, May 18, 2024

గౌలి దొడ్డిలో.. ” ప్రదాన్ కన్వెన్షన్ ” హాలుపై చర్యలేవి..?

తప్పక చదవండి
  • ఎంపీ, ఎమ్మెల్యే లైతే కూల్చివేతలు చేపట్టారా..?
  • స్పీకింగ్ ఆర్డర్ జారీ చేసిన టౌన్ ప్లానింగ్ అధికారులు..
  • కూల్చివేతలకు మీన మేషాలు లెక్కిస్తున్న వైనం..

నార్సింగి, 12 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :
నార్సింగి మున్సిపాలిటీలో కొందరు అకృమార్కులు బరితెగించి మరీ అక్రమాలకు తెగబడుతున్నారు.. ఎమ్మెల్యే, ఎంపీలు వారి బంధులైతే అక్రమ నిర్మాణాలు చేపట్టి మున్సిపల్ ఖజానాకు పన్నుల రూపంలో కోట్ల రూపాయల ఎగవేసినా వారి జోలికి పోవడానికి ఏ అధికారి సాహచించడు.. కానీ బతుకుదెరువు కోసం రోడ్ పక్కన పాన్ డబ్బా, టీ కొట్టు పెట్టుకుంటే అటు మున్సిపల్, ఇటు రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేయకుండానే నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తారు.. పేదోడికి ఓ న్యాయం, బలిసినోడికి మరో న్యాయం అన్నట్లుగా గౌలిదొడ్డికి పోయే సర్వీస్ రోడ్ పక్కన సుమారు ఐదు ఎకరాల్లో మున్సిపల్ కార్యాలయం నుండి ఎటువంటి అనుమతులు పొందకుండానే భారీ ఎత్తున ” ప్రధాన్ ” అనే పేరుతో ఫంక్షన్ హాల్ అక్రమ నిర్మాణం సాగుతోంది.. ఈ అక్రమ నిర్మాణానికి సహకరించినందుకు పెద్ద మొత్తంలో చేతులు మారినట్లు బహిరంగ ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి.. అదే దారిలో అన్వయ కన్వెన్షన్ హాలు వెనుక భాగంలో అనుమతులు లేకుండానే అనీల్ అనే వ్యక్తి పబ్బు స్థాపన కోసం శరవేగంగా నిర్మాణ పనులు సాగిస్తున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు.. ప్రధాన్ కన్వెన్షన్ హాలు, అన్వయ ఫంక్షన్ హాలు వెనుక గల పబ్బుకు రెండు సార్లు నోటీసులిచ్చి మూడవ నోటీసు స్పీకింగ్ ఆర్డర్ అనగా కూల్చివేయుటకు అని దాని అర్ధం.. కానీ ఎంపీ, ఎమ్మెల్యేలు వారి బంధువులైతే కూల్చివేతలు ఉండవా..? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.. ఖానాపూర్ గ్రామంలో బ్రతుకు దెరువు కోసం అంగడి బజారులో పాన్ డబ్బాను పెట్టుకుంటే రెవెన్యూ, మున్సిపల్ అధికారులు కూల్చటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. మున్సిపల్ శాఖ మంత్రికి చిత్తశుద్ధి ఉంటే నార్సింగి మున్సిపాలిటీలో అధికార పార్టీ ముసుగులో కొందరు కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు సైతం అక్రమాలకు తెగబడుతున్నారు.. వారిపై దృష్టి సారించి, అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని ఈ ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు