Monday, May 13, 2024

దూసుకెళ్తున్న స్టాక్ మార్కెట్..

తప్పక చదవండి

స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయడం రిస్క్ అని చాలా మంది అనుకుంటుంటారు. అయితే ఆర్థిక నిపుణుల సలహా తీసుకుంటూ సరైన స్టాక్స్‌లో పెట్టుబడి పెడితే మంచి రిటర్న్స్ వస్తాయని చెప్పొచ్చు. అలాంటి ఒక స్టాక్ తక్కువ కాలంలోనే అదిరిపోయే లాభాలను అందించింది.
భారత స్టాక్ మార్కెట్లలో మల్టీబ్యాగర్ రిటర్న్స్ ఇచ్చే స్టాక్స్ చాలానే ఉంటాయి. ఇవి కొంత కాలంలోనే ఇన్వెస్టర్ల సంపదను ఊహించని రీతిలో పెంచుతుంటాయి. ఒక్కసారి ఈ స్టాక్స్ గుర్తించి పెట్టుబడులు పెడితే దీర్ఘకాలంలో మంచి లాభాలు అందుకోవచ్చు. ఎక్కువ కాలం స్టాక్స్ హోల్డ్ చేస్తేనే ఎక్కువ లాభాలు వస్తాయని నిపుణులు చెబుతుంటారు. ఇంకా బోనస్, డివిడెండ్లు, షేర్లు బైబ్యాక్, స్టాక్ స్ప్లిట్ వంటి వాటితో అదనంగా లాభం చేకూరే అవకాశాలు ఉంటాయి. అలాంటి ఒక స్మాల్ క్యాప్ స్టాక్ ఇన్వెస్టర్లకు మంచి లాభాలు అందించింది. గత మూడేళ్లలో మల్టీబ్యాగర్ రిటర్న్స్ ఇచ్చింది.
అదే సివిల్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ ఎన్‌సీసీ లిమిటెడ్. గత మూడేళ్లలో ఈ స్టాక్ భారీగా పెరిగింది. 2020, సెప్టెంబర్ 18న రూ. 32.75 వద్ద ఉన్న షేరు 2023, సెప్టెంబర్ 14 నాటికి రూ. 150.70 కు చేరింది. ఈ మూడేళ్ల హోల్డింగ్ పీరియడ్‌లో 350 శాతం రిటర్న్స్ అందించింది. అంటే మూడేళ్ల కిందట ఈ స్టాక్‌లో రూ. లక్ష పెట్టుబడి పెట్టిన వారికి ఇప్పుడు రూ.4.50 లక్షల రిటర్న్స్ వచ్చాయి. అంటే రూ. 3.50 లక్షల లాభమే వచ్చింది. ఇక రూ. 5 లక్షలు పెట్టుబడి పెట్టినట్లయితే రూ.17.50 లక్షల లాభంతో మొత్తం సంపద రూ.22.50 లక్షలయ్యేది.
2023-24 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఈ ఎన్‌సీసీ కంపెనీ అదిరిపోయే ఫలితాలు ప్రకటించింది. సంస్థ నికర లాభం 35.18 శాతం పెరిగి రూ. 182.24 కోట్లుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో లాభం రూ.134.81 కోట్లుగా ఉండేది. కంపెనీ ఆదాయం కూడా 31.89 శాతం పుంజుకొని.. రూ. 4380.39 కోట్లకు చేరింది. ఇక కంపెనీకి ప్రస్తుతం రూ. 54,110 కోట్ల విలువైన ఆర్డర్లు ఉన్నాయి.
ఎన్ సి సి లిమిటెడ్ కంపెనీ ప్రస్తుతం రోడ్లు, భవనాల నిర్మాణం, నీటిపారుదల, వాటర్ అండ్ ఎన్విరాన్‌మెంట్, ఎలక్ట్రికల్, మెటల్స్, మైనింగ్, రైల్వేస్ విభాగంలో ఉంది. తన సబ్సిడరీల ద్వారా మిడిల్ ఈస్ట్‌లో కూడా తన కార్యకలాపాలు కొనసాగిస్తోంది. ప్రధానంగా దుబాయ్, మస్కట్‌లో ఈ కంపెనీకి అనుబంధ సంస్థలు ఉన్నాయి. ఇవాళ ఈ స్టాక్ రూ.147 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. ఏడాదిలోనే దాదాపు 100 శాతం పెరిగింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ స్వల్ప లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 50 పాయింట్లు, నిఫ్టీ 30 పాయింట్ల మేర పెరిగింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు