Saturday, July 27, 2024

ఉస్మానియాలో విజయవంతంగా కాలేయ మార్పిడి ఆపరేషన్..

తప్పక చదవండి
  • చనిపోతాడనుకున్న వ్యక్తికి పునరుజ్జీవం పోసిన వైద్యులు..
  • ఒక్క రూపాయి ఖర్చులేకుండా ఆపరేషన్ చేసిన ఘనత..
  • సిద్ధిపేట జిల్లా, చేర్యాల గ్రామానికి చెందిన మురళికి ఆపరేషన్..

హైదరాబాద్ : మరికొన్ని రోజుల్లో చనిపోతాననుకున్న ఓ వ్యక్తికి ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు పునరుజ్జీవనం పోశారు. బ్రెయిన్ డెడ్ అయిన ఓ పేషంట్ కాలేయాన్ని ఉస్మానియా వైద్యులు మరో వ్యక్తికి అమర్చి ఆపరేషన్ ని సక్సెస్ చేశారు. కాలేయం మార్పిడి చేసి ఉస్మానియా వైద్యులు ప్రాణం పోశారు. ఈ కాలంలో ఆర్గాన్ ట్రాన్స్పెంటేషన్ అంటే ఎంతో ఖర్చుతో కూడుకున్న విషయం. కానీ ఉచితంగానే రూపాయి ఖర్చులేకుండా కాలేయం మార్పిడి చేశారు ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు. సిద్దిపేట జిల్లా చేర్యాల కి చెందిన మురళి రెండేళ్ల క్రితం నుంచి కాలయ వ్యాధితో బాధపడుతున్నారు. ఎన్ని ప్రైవేట్ ఆస్పత్రులు వెళ్లిన కాలయ మార్పిడి తప్పదని సూచించారు. దాదాపుగా 30 లక్షల రూపాయలు ఖర్చవుతుందని ప్రైవేట్ ఆస్పత్రులు వైద్యులు తెలిపారు. చివరి ప్రయత్నం గా ఉస్మానియా ఆసుపత్రికి సంప్రదించగా కొన్ని రకాల టెస్టులు చేసిన తర్వాత ఉస్మానియా వైద్యులు వేరే వ్యక్తి కాలయ మార్పిడి చేస్తే తప్ప మురళి బ్రతికే అవకాశం లేదని వైద్యులు తెలిపారు.

అదే సమయంలో ప్రమాదంలో గాయపడి బ్రెయిన్డెడ్ అయినటువంటి మరో పేషెంట్ గాంధీలో మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న జీవన్ దాన్ సభ్యులు చనిపోయిన కుటుంబ సభ్యులతో మాట్లాడి అవయవదానానికి ఒప్పించారు. ఆ తర్వాత చనిపోయిన వ్యక్తి కాలేయాన్నితొలగించారు. అనంతరం విజయవంతంగా ఉస్మానియా ఆసుపత్రిలో కాలేయ వ్యాధితో బాధపడుతున్న మురళికి అమర్చారు. ఆపరేషన్ తర్వాత కాలేయం పనితీరు సక్రమంగా ఉండటంతో ఆపరేషన్ సక్సెస్ అయిందని ఉస్మానియా వైద్యులు తెలిపారు. దాదాపుగా 48 గంటల పాటు కష్టపడి సర్జరీ విజయవంతం చేసిన డాక్టర్లు మధుసూదన్, పాండు నాయక్ , మాధవి, పావని, సుదర్శన్ , అమర్దీప్ ను సూపర్డెంట్ నాగేందర్ అభినందించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు