సోమవారం రోజు విద్యానగర్ లోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్ధిని, విద్యార్థులకి చదువు యొక్క ప్రాధాన్యతను తెలియ చేస్తూ శ్రీ ఆకాంక్ష చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక కార్యదర్శి పాలపర్తి సంధ్యారాణి నోట్ బుక్స్ ని ఉన్నత తరగతి విద్యార్థులకు అందచేశారు. చదువుపై శ్రద్ధ ఉన్న విద్యార్థులకు తమ వంతు చేయూత తప్పక ఇస్తామని అన్నారు. ఆడపిల్లలు అన్ని రంగాలలో రాణిస్తున్నారని, కాబట్టి బాగా చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రమేష్, రాణి, పద్మ, విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.