Monday, April 15, 2024

దివ్యాంగులకు అండగా నిలిచినా సీఎం కేసీఆర్ కి ధన్యవాదాలు..

తప్పక చదవండి
  • తెలంగాణ రాష్ట్ర వికలాంగుల సమితి ఉపాధ్యక్షులు దీకొండ నరేష్..

రాష్ట్రప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో దేశానికి ఆదర్శంగా ముందుకు సాగుతున్న కెసిఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం మానవియ పాలనను అద్దం పడుతుంది అని, దివ్యాంగులకు ఆర్థిక భరోసనిస్తూ దేశంలోని ఎక్కడ లేనివిధంగా 3016 రూపాయలు ఆసరా పెన్షన్ అందజేస్తున్న సీఎం కేసీఆర్, మరో 1000 రూపాయలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.. ఈ పెంపుతో ఆసరా పెన్షన్ 4016 చేరుకుంది.. రాష్ట్ర వ్యాప్తంగా 5,11,656 మంది వికలాంగులకు లబ్ధిదారులకు ఇప్పటికే రూ. 3016 అందిస్తున్న సీఎం మరొక్క రూ. 1000 పెంచడం ద్వారా నెలకు 53 కోట్లు సంవత్సరానికి రూ. 616 కోట్లు అదనపు భారం అయినప్పటికీ, సీఎం వికలాంగులకు అండగా నిలవాలని మానవతా హృదయంతో అండగా ఉండటం ద్వారా వికలాంగుల్లో ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అని అన్నారు.. దీనికి సంబంధించిన సీఎం కేసీఆర్ సంబంధించిన జీవోను విడుదల చేయడం జరిగింది.. రాష్ట్రవ్యాప్తంగా ఎంతో భరోసా అందిస్తూ దివ్యాంగుల సంక్షేమానికి సంబంధించి ఇప్పటికే గడిచిన తొమ్మిదేళ్ల కాలంలో పదివేల కోట్లకు పైగా ఖర్చు చేయడం దివ్యాంగుల అభ్యున్నత పట్ల సీఎం కెసిఆర్ కి ఉన్న చిత్తశుద్ధి తెలియపరుస్తుంది అని అన్నారు.. దేశంలో ఏ ప్రభుత్వం ఇంత ఆసరా పెన్షన్ ఇస్తలేదు.. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ కు ప్రతి దివ్యాంగుడి కుటుంబం అండగా నిలబడుతుంది అని పేర్కొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు