తెలంగాణ బీసీ గురుకులాల్లో.. బీఎస్సీ (ఆనర్స్) అగ్రికల్చర్ కోర్సు మహాత్మా జోతిబా ఫులే తెలంగాణ బ్యాక్‌వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ బీఎస్సీ కోర్సులో ప్రవేశాల కోసం ప్రకటన విడుదల చేసింది.
కోర్సు: బీఎస్సీ (ఆనర్స్) అగ్రికల్చర్ (మహిళా అభ్యర్థులకు మాత్రమే)
సీట్ల సంఖ్య: 240 (బీసీ- 75 శాతం, ఎస్సీ- 15 శాతం, ఎస్టీ- 5 శాతం, ఓసీ/ఈబీసీ- 2 శాతం, అనాథలు- 3 శాతం)
కాలేజీలు: అగ్రికల్చరల్ కాలేజీ వనపర్తి, కరీంనగర్
ఈ కాలేజీలను 2022-23 అకడమిక్ విద్యాసంవత్సరం నుంచి ప్రారంభించారు.
ఎంసెట్, అగ్రిసెట్ ర్యాంకుల ఆధారంగా ఈ కాలేజీల్లో ప్రవేశాలను కల్పిస్తారు
అర్హతలు
తెలంగాణకు చెందిన మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి
గ్రామీణ ప్రాంతాల్లో నివసించే అభ్యర్థులు అయితే వారి తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.లక్షన్నరకు మించరాదు. పట్టణ ప్రాంతాల వారైతే రూ.2 లక్షలు మించరాదు.
ఇంటర్ (బయాలజీ, ఫిజికల్ సైన్సెస్) ఉత్తీర్ణత
ఎంసెట్-2023 అర్హతలు కలిగి ఉండాలి
వయస్సు: 17 – 22 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు అయితే 25 ఏండ్లు మించరాదు.
నోట్: ఉచిత వసతి, భోజన సౌకర్యం ఉంటుంది.
ఇది 100 శాతం రెసిడెన్షియల్ ప్రోగ్రామ్.
ముఖ్యతేదీలు
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేదీ: ఆగస్టు 16 (సాయంత్రం 5 వరకు)
వెబ్‌సైట్: https://ug.mjptbcwreis.net
తప్పక చదవండి
-Advertisement-