- గుర్తించిన అధికారులు..
- ఎస్-4 భోగీలోని బల్బ్ ఫార్మేషన్ సరిగా లేదు..
- ఏదైనా కెమికల్ వల్ల ప్రమాదం జరిగిందా అనేదానిపై కూడా దర్యాప్తు..
- ఫోరెన్సిక్ రిపోర్ట్ వస్తేనే వాస్తవాలు బయటకు వస్తాయి..
యాదాద్రి జిల్లా బీబీ నగర్ దగ్గర ఇటీవల జరిగిన ట్రైన్ అగ్ని ప్రమాదం సంచలనం సృష్టించింది.. రైలు ఎక్కాలంటేనే ప్రయాణికులు భయపడే పరిస్థితులు నెలకొన్నాయి.. అదృష్టవశాత్తు ప్రాణ నష్టం జరగకపోయనా.. రైల్వే శాఖ నిర్లక్ష్యంతో లక్షలాది మంది ప్రయాణికుల భద్రతపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. ఈ ఘటనపై రైల్వేశాఖ వేగంగా దర్యాప్తు చేస్తోంది. ప్రమాదం జరిగిన తరువాత ఢిల్లీ నుంచి వచ్చిన రైల్వే టెక్నికల్ టీం సంఘటనా స్థలాన్ని పరిశీలించింది. కాలి బుడిద అయిన అరు బోగీల్లో 153 శాంపిల్స్ సేకరించింది. బ్యాటరీ లింక్ దగ్గర నుంచి వైరింగ్ వరకు అణవణువు పరిశీలించి నమునాలు సేకరించారు. హైదరాబాద్ ఫోరెన్సిక్ అసిస్టెంట్ డైరెక్టర్ వెంకన్న నేతృత్వంలోని బృందం కూడా సంఘటనా స్థలాన్ని పరిశీలించి.. నమునాలు సేకరించారు.
ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్టు అధికారులు గుర్తించారు. ఎస్ -4 బోగీలోని బాత్ రూంలో బల్బ్ ఫార్మేషన్ సరిగ్గా లేనట్టు గుర్తించారు. ఇంటర్నల్ వైరింగ్‌లో లోపం కూడా ప్రమాదానికి కారణంగా అనుమానిస్తున్నారు. టాయిలెట్స్‌లో ఎప్పుడూ లైట్ వెలుగుతుంది. ఇలాంటి సందర్భాల్లో బల్బ్ షార్మేషన్ సరిగా లేకపోతే ప్రమాదం జరిగే అస్కారం ఉందంటున్నారు క్లూస్ టీం అధికారులు.. ఒక్కోసారి లోడ్ ఎక్కువ కావడంతో సర్క్యూట్ బ్రేకర్స్ నుంచి ఫ్లాష్ రిలీజ్ అయి ప్రమాదం సంభవించే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు. ఏదైనా కెమికల్స్ కారణంగా ప్రమాదం జరిగిందా అనే కోణంలోనూ దర్యాప్తు జరుగుతోంది. అందుకే అల్యుమినీయం, మెటల్ బూడిదను ఎఫ్‌ఎస్‌ఎల్ ల్యాబ్‌కు పంపారు. బ్యాటరీలో ఏలాంటి లోపాలను గుర్తించలేదు అధికారులు.. ఒక్కో బోగీకి కావాల్సిన 120 ఏ.ఎం.పీ.ఎస్. విద్యుత్ సరఫరా ఉన్నట్టు గుర్తించారు. ఇక్కడ బ్యాటరీ సమస్య లేదనేది స్పష్టమైంది. ఇక ప్రయాణికులు అనుమానిస్తున్నట్టు సిగరెట్ ద్వారా ప్రమాదం జరగడానికి తక్కువ అస్కారం ఉందని భావిస్తున్నారు అధికారులు. అయితే ఏదైనా ఎక్స్‌ప్లోజివ్ మెటీరియల్ మీద.. కాల్చేసిన సిగరెట్ ముక్క పడితే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కానీ అక్కడ అలాంటివి ఏమీ లేవు. కాబట్టి సిగరెట్‌కూ ప్రమాదానికి ఎలాంటి సంబంధం లేదని భావిస్తున్నారు అధికారులు. మొత్తంగా షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగిందనేది అధికారులు తేల్చారు. అయితే ఫోరెన్సిక్ రిపోర్ట్ వస్తేనే పూర్తి నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు..