Sunday, May 5, 2024

‘ఓలా’ భవిష్‌ అగర్వాల్‌కు షాక్‌..

తప్పక చదవండి
  • ఇద్దరు క్లోజ్‌ అసోసియేట్స్‌ రాజీనామా..
    దేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్‌ టూ వీలర్స్‌ వెహికల్స్‌ తయారీ సంస్థ ‘ఓలా ఎలక్ట్రిక్‌’ ఫౌండర్‌ కం సీఈఓ భవిష్‌ అగర్వాల్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఓలా ఎలక్ట్రిక్‌ ప్లానింగ్‌ అండ్‌ స్ట్రాటర్జీ హెడ్‌ శ్లోకార్త్‌ దాస్‌, పార్టనర్‌ షిప్స్‌ అండ్‌ కార్పొరేట్‌ ఎఫైర్స్‌ హెడ్‌ సౌరబ్‌ శర్దా రాజీనామా చేశారు. వారిద్దరూ శనివారమే రాజీనామా చేసినట్లు సమాచారం. ఏడెనిమిదేండ్లుగా శ్లోకార్త్‌ దాస్‌ కంపెనీలో పని చేస్తున్నారు. శ్లోకార్త్‌, సౌరబ్‌ శార్దాలిద్దరూ భవిష్య్‌ అగర్వాల్‌కు అత్యంత సన్నిహితులని తెలుస్తున్నది. శ్లోకార్త్‌, సౌరబ్‌ రాజీనామాలపై ఓలా అధికార ప్రతినిధి స్పందించారు. ఏడేండ్లకు పైగా శ్లోకార్త్‌, సౌరబ్‌ కంపెనీ ఎదుగుదలకు ఎంతో క్రుషి చేశారని కొనియాడారు. వారి భవిష్యత్‌ ప్రణాళికలు విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన, అత్యంత అనుభవం గల నాయకత్వ టీం తమకు ఉందని ఓలా అధికార ప్రతినిధి తెలిపారు. టెస్లా, ఆపిల్‌, ఎల్‌జీ వంటి గ్లోబల్‌ దిగ్గజ సంస్థలతోపాటు భారతీయ కంపెనీల నుంచి 50 మందికి పైగా ప్రముఖులను గత ఏడాది కాలంగా నియమించుకున్నామని తెలిపారు. టెక్నాలజీ భవిష్యత్‌కు భారత్‌ హబ్‌గా నిలుస్తుంది. అంతర్జాతీయంగా ఎంతో ప్రతిభావంతులైన నిపుణులు తమ వంటి నూతన తరం కంపెనీల్లో చేరేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని ఓలా అధికార ప్రతినిధి అన్నారు. ఇదిలా ఉంటే శ్లోకార్త్‌, సౌరబ్‌లతోపాటు మరో ఇద్దరు సీనియర్‌ స్థాయి ఎగ్జిక్యూటివ్‌లు త్వరలో కంపెనీ నుంచి వైదొలగున్నారని వార్తలొస్తున్నాయి.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు