Wednesday, May 22, 2024

సీఎం ను ఆశీర్వదించిన శివస్వాములు..

తప్పక చదవండి
  • కేసీఆర్ ను కలిసిన మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల స్వాములు..
  • బ్రాహ్మణుల సంక్షేమానికి కేసీఆర్ అద్భుతమైన కృషి చేస్తున్నారు..
  • భవిష్యత్తులో బీ.ఆర్.ఎస్. విజయతీరాలకు చేరుతుంది..
  • ప్రగతి భవన్ లో చోటుచేసుకున్న సంఘటన..

హైదరాబాద్ : ప్రగతిభవన్‌కు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన 60 మంది శివ స్వాములు తరలివచ్చారు. ముగ్గురు ముఖ్యులతో కలిసి హైదరాబాద్‌కు శివ స్వాములు బయల్దేరి వచ్చారు. బ్రాహ్మణ సంక్షేమానికి కృషి చేస్తోన్న సీఎం కేసీఆర్‌ను ఆశీర్వదించడానికి స్వాములు వచ్చారు. బీఆర్ఎస్ అధినేతగా విజయ తీరాలు చేరేలా స్వాములు ఆశీస్సులు అందించారు. అలాగే భవిష్యత్‌లో మహారాష్ట్రలో కూడా బ్రాహ్మణ సంక్షేమ కార్యక్రమాలు చేపట్టేలా దృష్టి పెట్టాలని సీఎం కేసీఆర్‌ను స్వాములు కోరారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు