Saturday, April 20, 2024

బెస్ట్ ఆల్ రౌండర్ అవార్డు అందుకున్నసినీ టీవీ రచయిత రాజేంద్ర రాజు కాంచనపల్లి..

తప్పక చదవండి

ఓ తండ్రి తీర్పు చిత్రానికి బహుముఖ ప్రజ్ఞ కనబరిచిన రాజేంద్రకు అవార్డు అందించిన ఏవీకే ఫిలిమ్స్ అధినేత , చిత్ర సమర్థకులు,సేవా సర్వభౌమ లయన్ ఆరిగపూడి విజయ్ కుమార్..

ప్రముఖ కవి సినీ టీవీ రచయిత బంగారు నంది అవార్డు గ్రహీత రాజేందర్ రాజు కాంచనపల్లి ఓ తండ్రి తీర్పు చిత్రంలో ప్రధాన పాత్రలో నటించడమే కాకుండా రచన దర్శకత్వ పర్యవేక్షణ చేయటం అతని ప్రతిభకు నిదర్శనం. రాజేంద్ర రాజు రచించిన టైటిల్ సాంగ్ ” అమ్మ నాన్నలు తెగిన గాలిపటాలు…ఏ దరికి చేరలేని ఏకాకి జీవితాలు… ” వింటే కన్నీళ్లు ఆగవు. సినిమా క్లైమాక్స్ లో అతను రాసిన డైలాగ్స్ అద్భుతంగా ఉన్నాయి. విన్న ప్రేక్షకులు చప్పట్లు కొడతారు. ప్రతి మనిషి జీవితంలో సంతృప్తి చెందే ఒక సందర్భం వస్తుంది ఆ సందర్భం నాకు ఓ తండ్రి సినిమా సమర్పకుడిగా ఇప్పుడు వచ్చింది. అందర్నీ కలుపుకుపోతూ.. సినిమాకు కావలసిన ఔట్పుట్ రప్పించడంలో తమ్ముడు రాజేంద్ర రాజు సక్సెస్ అయ్యాడు. ఈ సినిమా కోసం అతను రాత్రి పగలు కష్టపడిన తీరు సినిమాకు పని చేసిన నాతో సహా… లైట్ బాయ్ దగ్గర నుండి నటీనటులు టెక్నీషియన్స్ నిర్మాత అందరూ రారాజును తమ ఫ్యామిలీ మెంబర్ గా ఓన్ చేసుకున్నారు… ఇష్టపడ్డారు.

- Advertisement -

రాజేంద్ర రాజుకు బాధ్యత ఇవ్వటం అంటే భరోసాగా ఉండటమే :
ఒక సినిమాకు ఒక టెక్నీషియన్ ఎంత కష్టపడతాడో ప్రతి ఒక్కరికి తెలుసు. లొకేషన్ బుక్ చేయడం దగ్గర నుండి ప్యాకప్ చెప్పే వరకు 24 క్రాఫ్ట్ లను సమన్వయపరిచి షూటింగ్ విజయవంతంగా పూర్తి చేయడం లో రాజేంద్ర రాజు కృషి మాటల్లో చెప్పలేనిది. ఇది అతనికి మాత్రమే సాధ్యమైంది. ఇలాంటి అసమాన ప్రతిభగల వ్యక్తి ఒక్కరు ఉంటే చిత్ర నిర్మాతకు సగం పని తగ్గుతుంది. మా రారాజుకు బెస్ట్ ఆల్ రౌండర్ అవార్డు అందచేస్తున్నందుకు ఆనందంగా ఉంది. రాజేంద్ర రాజు ఈ చిత్రంలో ఆత్మీయత పంచే అల్లుడుగా నటించడమే కాకుండా.. జీవిత కాలం నిలిచిపోయే మంచి పాట రాశాడు. రాజేంద్ర రాజుకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. భగవంతుడు మా రారాజుకు అష్ట ఐశ్వర్యాలు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను.” అని ఏవికే ఫిలిమ్స్ అధినేత చిత్ర సమర్పకులు ఆరిగపూడి విజయ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా నిర్మాత లయన్ శ్రీరామ్ దత్తి, హీరో వివ రెడ్డి, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ సురేష్ చెటిపల్లి, యూనిట్ సభ్యులందరూ రాజేంద్ర రాజు కాంచనపల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు