Wednesday, May 8, 2024

ముగ్గురమ్మల మూలపుటమ్మకు ఇద్దరమ్మల బోనాలు.(జాతర స్పెషల్)

తప్పక చదవండి
  • అమ్మవారి సేవలో రామ్ గోపాల్ పేట్ కార్పొరేటర్ చీర సుచిత్ర శ్రీకాంత్, మోండా డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్.
  • ఎటువంటి రాజకీయ నేపథ్యం లేకుండా ఏకంగా కార్పొరేటర్లుగా గెలవడం అమ్మవారి చలవే అంటున్న మహిళా నేతలు..
  • స్థానికత్వంతో ప్రజలకు – ఆస్తికత్వంతో భక్తులకు చేరువవ్వడంలో వీరికి వీరే సాటి…

సికింద్రాబాద్ లో అత్యంత ప్రాముఖ్యత సంపాదించుకున్న డివిజన్లు రాంగోపాల్ పేట్, మోండా మార్కెట్. తెలుగువారితో సమానంగా, వివిధ రాష్ట్రాల ప్రజలు, విభిన్న భాషా సంస్కృతుల జనజీవనం కలిగి ఉండడం ఈ రెండు డివిజన్ల యొక్క ప్రత్యేకత. అన్ని వర్గాల ప్రజల ఆదరణ ఉంటే కానీ ఈ స్థానాల్లో రాజకీయంగా గెలవడం కష్టం. అలాంటిది, 2020 సంవత్సరం జి.హెచ్.ఎం.సి. ఎలక్షన్స్ లో బలమైన ప్రత్యర్ధులపై అలవోకగా కార్పొరేటర్లుగా గెలుపొందారు కొంతం దీపిక, చీర సుచిత్ర. ఎటువంటి రాజకీయ నేపథ్యం లేకుండా గెలవడం శ్రీ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి చలవే అని అంటున్నారు ఈ ప్రజా ప్రతినిధులు. స్థానిక పరిస్థితులపై అపార అనుభవం, అమ్మవారి ఆలయంతో ఉన్న సుదీర్ఘ అనుబంధంతో భక్తులకు కావలసిన వసతులు ఏర్పాటు చేయడంలో తమదైన శైలిలో ప్రతి సంవత్సరం ముందుంటున్నారు మన ఆడపడుచులు. జాతర సందర్భంగా వీరిద్దరూ అమ్మవారికి బోనం సమర్పించుకొని మొక్కులు తీర్చుకున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు