Monday, April 29, 2024

అనుమతులు లేకుండా నడుస్తున్న ధ్యాన్ పబ్లిక్ స్కూల్..

తప్పక చదవండి
  • రంగారెడ్డి జిల్లా, బీ.ఎన్. రెడ్డి నగర్, టీచర్స్ కాలనీలో స్కూల్ నిర్వహణ..
  • అక్రమంగా ఇంటి ఆవరణలో కొనసాగుతున్న మరో స్కూల్ ఈషా స్కూల్ ఆఫ్ లెర్నింగ్..
  • అధికారులకు ఫిర్యాదు చేసిన మాసారం ప్రేమ్ కుమార్..

జిల్లా విద్యాశాఖ నుండి ఎలాంటి అనుమతులు లేకుండా యాదిరెడ్డి నిలయం, టీచర్స్ కాలనీ, బి.యన్ రెడ్డి నగర్, రంగారెడ్డి జిల్లాలో ధ్యాన్ పబ్లిక్ స్కూల్ కొనసాగడంపై సామాజిక కార్యకర్త మాసారం ప్రేమ్ కుమార్ అధికారులకు ఫిర్యాదు చేశారు.. తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాల ఏర్పాటు చేయాలంటే ముందుగా ఆ జిల్లాలోని విద్యాశాఖ కార్యాలయం నుండి తప్పకుండా అనుమతులు పొందాలి. ఒకవేళ పాఠశాల విద్యాశాఖ నుండి ఎలాంటి అనుమతులు తీసుకోకుంటే ఆ పాఠశాల యజమాన్యంపై జిల్లా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ యాదిరెడ్డి నిలయం, టీచర్స్ కాలనీలో ధ్యాన్ పబ్లిక్ స్కూల్ యజమాన్యం ప్రభుత్వ ఉత్తర్వుల (జీఓ నెంబర్ 1) ప్రకారం ఎలాంటి అనుమతులు లేకుండా కొనసాగుతున్నా.. జిల్లా విద్యాశాఖ చర్యలు తీసుకోకపోవడం ఏంటని ఆయన ప్రశ్నిస్తున్నారు.

ఇంటి ఆవరణలో పాఠశాల అనుమతులు :
ఇషా స్కూల్ ఆఫ్ లెర్నింగ్ అనే పాఠశాలకు రంగారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారులు వై పి నిలయం, ఫేస్ 4 హస్తినాపురం సౌత్, హస్తినాపురం, రంగారెడ్డి జిల్లా ఇంట్లో కొనసాగుతున్న పాఠశాలకు ఒకటవ తరగతి నుండి ఏడవ తరగతి వరకు అనుమతులు ఇవ్వడం జరిగింది. ఎస్టాబ్లిష్మెంట్ రికగ్నైజేషన్ అడ్మినిస్ట్రేషన్, కంట్రోల్ ఆఫ్ స్కూల్ అండర్ ప్రైవేట్ మేనేజ్మెంట్ రూల్ 1993, ప్రభుత్వ ఉత్తర్వులు జీ. ఓ.ఎం.ఎస్ 1 ఉల్లంఘించి స్వార్థ ప్రయోజనాల కోసం జిల్లా విద్యాశాఖ అధికారులు అనుమతి ఇచ్చారంటే వారి అవినీతి ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. విద్యార్థుల సంక్షేమం, విద్యార్థుల భద్రత కోసం పాఠశాల యజమాన్యం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నిష్ణాతులైన వారితో ఒక కమిటీని ఏర్పాటు చేసి, అన్ని కోణాలలో ఆలోచించి కమిటీ చేసిన సిఫార్సు పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేయడం జరుగుతుంది. కానీ కొంతమంది అధికారులు ప్రభుత్వ ఉత్తర్వులు పట్టించుకోకుండా వారి ఇష్టానుసారం అనుమతులు ఇవ్వడం బాధాకరం. పిల్లల భవిష్యత్తు, ప్రాణాలు పణంగా పెట్టి ప్రైవేట్ పాఠశాల యజమాన్యాలు విసిరే ఎంగిలి మెతుకులకు ఆశపడి వ్యవస్థని నాశనం చేయడం శోచనీయం. ఇప్పటికైనా వాస్తవాలను గ్రహించి అనుమతులు లేకుండా కొనసాగుతున్న ధ్యాన్ పబ్లిక్ స్కూల్ పై, అక్రమంగా అనుమతులు పొందిన ఇషా పాఠశాల గుర్తింపును రద్దు చేయాలి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు