Wednesday, May 15, 2024

ట్రైబల్ వెల్ఫేర్ విద్యాసంస్థల్లో గోండు చెంచు విద్యార్థుల అరి గోసలు..

తప్పక చదవండి
  • హయత్ నగర్ ట్రైబల్ వెల్ఫేర్ లో ఉద్యోగుల గోల్ మాల్..
  • విధులు నిర్వహించకుండానే జీతాలు తీసుకుంటున్న వైనం..
  • ఆగడాలు చేస్తున్న నాన్ ట్రైబల్ ఉద్యోగులు..
  • విద్యకు దూరమవుతున్న ఆదివాసీ తెగల విద్యార్థులు…

తెలంగాణ ప్రభుత్వం ఆదివాసి తొమ్మిది విద్యార్థి తెగలను ఉన్నత చదివే లక్ష్యంగా ఏర్పాటు చేసిన ట్రైబల్ వెల్ఫేర్ విద్యాసంస్థల లో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి.

నల్లగొండ జిల్లా, దేవరకొండ సమీపంలోని ట్రైబల్ వెల్ఫేర్ విద్యసంస్థలను హయతనగర్ సమీపంలో ఏర్పటు చేశారు. తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ నిబంధనల ప్రకారం ఈ విద్యా సంస్థల్లో తొమ్మిది విద్యార్థి తెగలు కోయ, గుండు, చెంచు, నాయకపోడు, పరదాన్, తోటి, అందు, బిల్ తెగ, కొండారెడ్డి తెగల విద్యార్థులను
ఉన్నత చదువులే లక్ష్యంగా ఏర్పాటు చేసినట్లు ఆదివాసి విద్యార్థి సంఘల చెర్మన్ సాగబోయిన పాపా రావు తెలిపారు. హయతనగర్ లోని ట్రైబల్ వెల్ఫేర్ విద్యాసంస్థలో నిబంధనలకు విరుద్ధంగా నాన్ ట్రైబల్ ఉద్యోగులు అరాచకంగా వ్యవహరిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నట్లు పాపారావు పేర్కొన్నారు.

- Advertisement -

హయత్ నగర్ ట్రైబల్ వెల్ఫేర్ విద్యా సంస్థల్లో నాన్ ట్రైబల్ ఉద్యోగులదే ఆదిపత్యం :
ప్రభుత్వ నిబంధన ప్రకారం ట్రైబల్ వెల్ఫేర్ ఉద్యోగులని నియమించుకోవాలనే జీవోలు ఉన్నా ఇక్కడ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. హయత్ నగర్ ట్రైబల్ వెల్ఫేర్ విద్యాసంస్థల్లో ఆ తెగలకు సంబంధించిన ఉద్యోగులను మానసిక వేదనకు గురిచేస్తూ.. ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక వర్గం ఉద్యోగులు విధులు నిర్వర్తించకుండానే.. జీతాలు తీసుకుంటూ ఉద్యోగులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. హయత్ నగర్ ట్రైబల్ వెల్ఫేర్ లో ఆతొమ్మిది ఆదివాసి విద్యార్థులను చదవనీయకుండా మానసిక వేదనకు గురిచేయడంతో చదువుకు గిరిజన తెగలు దూరమవుతున్నారని విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తొమ్మిది తెగల విద్యార్థిని, విద్యార్థులు మైదాన ప్రాంతాలకు దూరంగా జీవన విధానం కొనసాగడంతో వారికి ప్రత్యేకంగా (పివీటిజి) విద్యా సంస్థ ఏర్పాటు చేసినట్లు పాపారావు తెలిపారు. ట్రైబల్ వెల్ఫేర్ విద్యాసంస్థల్లో ఆ తెగల అధ్యాపకులు ఉంటే బోధన విధానం సులభతరంగా వారి బాషలో ఉంటుందని తెలిపారు. హయత్ నగర్ ట్రైబల్ వెల్ఫేర్ జూనియర్ కాలేజీలో ఐఐటి, నీట్, ఎంసెట్, లాంగ్ టర్మ్ కోచింగ్ ల పేరుతో అక్కడ అమాయక గిరిజన తెగ విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ విధులకు హాజరుకాకుండానే ఉద్యోగుల సంబంధికుల పేరుతో జీతాలు తీసుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. హయత్ నగర్ ట్రైబల్ వెల్ఫేర్ లో జరుగుతున్న అక్రమాలపై ఉన్నతాధికారులు ఏ మేరకు చర్యలు తీసుకుంటారు వేచి చూడాల్సిందే.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు