Saturday, April 27, 2024

మస్కట్ లో అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు

తప్పక చదవండి
  • టాలీవుడ్ తారలతో తల తల మెరిసిన మస్కట్ నగరం
  • రెండు రోజులు శోభాయమానంగా ఘనంగా వేడుకలు
  • చిరు మెగా యూత్ ఫోర్స్ మరియు రాయల్ కింగ్
  • ఇలువురు సంయుక్తముగా నిర్వహించిన ఈ వేడుకలు

హైదరాబాద్ : ఒమాన్ దేశ రాజధాని మస్కట్ లో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి.. మున్నెన్నడూ లేని విధంగా సెలెబ్రెటీలు ,వివిధ విభాగాల నిపుణులతో టాలీవుడ్ మొత్తము సంక్రాంతి కి మస్కట్ వచ్చారా అన్నచందంగా రెండు రోజుల పాటు శోభాయమానంగా వేడుకలు నిర్వహించారు. చిరు మెగా యూత్ ఫోర్స్ మరియు రాయల్ కింగ్ సంయుక్తముగా నిర్వహించిన ఈ వేడుకలు నభూతో నభవిష్యత్తు అన్నట్టు అందరినీ అలరించాయి. ఇటీవల సినీరంగములో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రముఖులు మాగంటి మురళీ మోహన్ ను ఘనముగా సన్మానించడము ఓ అద్భుతముగా చెప్పవొచ్చు, ఒమాన్ దేశ చిహ్నం అయిన కంజరి నడుముకు తొడిగి స్వర్ణ కంకనముతో గౌరవించడము ఈ వేడుక లో ప్రధానఘట్టము గా చెప్పవొచ్చు.

Sankranti celebrations in Muscat 6

హైదరాబాద్ నివాసి, ఇటీవల మస్కట్ లో రాయల్ కింగ్ హోల్డింగ్ తొ భాగస్వామ్య వ్యాపారము మొదలు పెట్టిన ప్రముఖ టాలీవుడ్ నిర్మాత ,సినీ పంపిణీదారు మరియు వ్యాపారవేత్త అయిన బుర్ర ప్రశాంత్ గౌడ్, సీఎం వై ఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు అయిన రామదాస్ చందక లు ఈ కార్యక్రమాన్నీనిర్వహించారు. మురళి మోహన్ తో పాటు టాలీవుడ్ నటులు రజిత, మధుమని, పింకీ, సోనియా చౌదరి మరియు టివి నటి సంజన లు సంక్రాంతి వేడుకలకు కొత్త శోభాయమానం తెచ్చారు …శుక్రవారం సాయంత్రము 5.30 గంటలకు మొదలయిన కార్యక్రమము 12 గంటలు వరుకు ఏకరీతిగా నడిపించిన వాక్యత కుమారి మాధవి రెడ్డి గూర్చి ఎంత చెప్పినా తక్కువే. సింగర్స్ హనుమాన్, స్వాతి సత్యభామ, మోనికా యాదవ్ లు తమతమ గీతాలతో ప్రేక్షుకులును కట్టిపడేసారు. పాటలకు తగ్గ డాన్సులు ఢీ ఫేమ్ గోవింద్ టీమ్, స్టేజిను అట్రాక్ట్ గా నిలిచారు. జబర్దస్త్ సుధాకర్ తన గాలిపటాలు తో హల్ లో వున్నవారిని కడుపు ఉబ్బా నవ్వించాడు, ఉత్తరాంద్ర నుంచి వచ్చిన మరో కళాకారుడు ఎం ఎస్ ఆర్ నాయుడు తన వెంట్రిలాక్కుజమ్ నైపుణ్యముతో పిల్లలును అలరించారు.

- Advertisement -

సంక్రాంతి సంబరాలుకు హైదరాబాద్ నగరము నుంచి ప్రముఖులు శ్రీకర్ గౌడ్ (ఎక్స్ ఐ ఆర్ ఎస్) మరియు వ్యాపారవేత్త రమేష్ గౌడ్ లు రావడమే కాకున్నా, ఒమాన్ (మస్కట్) లో ఏ రంగాల్లో వ్యాపారము అభివృద్ధి చేయవచ్చో పరిశీలన చేసారు. ఈ వేడుకల్లో సామాజిక బాధ్యత కొట్టొచ్చినట్టు కనిపించడము విశేషము, 20 మార్లు కు పైగా రక్తదానము చేసిన 30 మంది యువతీయువకులకు, మురళేమోహన్ తో సత్కారము చేయించడం జరిగింది. ఇద్దరు అంబేద్కర్ సేవాసమితి మహిళామణులును శ్శాలువతో సత్కరించడము విశేషము.. అందులో భాగముగా మీడియా రంగానికి విశేష సేవలు అందిస్తున్న రాజేష్ మడకశిర కి కూడా మెమొంటో తో గౌరవించడము జరిగింది. మొత్తము ప్రోగ్రాము కు అన్నిరకాలుగా అండదండలు ఇచ్చిన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సంస్థ వైబ్రాంట్ సంస్థ పెద్దలు మల్లారెడ్డి, రవీంద్ర రెడ్డి మరియు శ్యామ్ సుందర్ రెడ్డిలతో పాటు సీఈఓ శ్రీనివాసరావు లను కూడా గౌరవించి, స్థానికంగా సహాయ సహకారాలు ఇచ్చిన బాలాజీ (టవల్ కంపెనీ) చంద్రశేఖర్, ప్రసాద్ రెడ్డి, నాగభూషణ్ కు మురళీ మోహన్ పుష్ప గుచ్ఛాలుతో సన్మానము చేశారు. ఈ మొత్తము కార్యక్రమానికి అన్నీ రకాల అనుమతి తెచ్చిన రాయల్ కింగ్ యజమాన్యము (శ్రీ రెన్నీ జాన్సన్ & టీం) కృషి అబినందనీయము. ఈ కార్యక్రమంలో చిట్టిమిళ్ళ శ్రీనివాస్, సాంకటిటీ ఇంటర్నేషనల్ ఇండియా పివీటీ లిమిటెడ్ ఎండీ ఏ రామకృష్ణ ప్రొడ్యూసర్ ఆస్ట్రేలియా, బీ ఎన్ దుర్గ ప్రసాద్ రావు సుపీరిటెండెంట్ డీజీపీ ఆఫీస్ తెలంగాణ, మిస్టర్ వంశీ కృష్ణ, భవాని, ద్వారకామాయి కన్స్ట్రక్షన్ ఎండీ, తదితరులు పాల్గొన్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు