Saturday, July 27, 2024

వికలాంగుల పింఛన్ రూ. 4016కి పెంచడం కాంగ్రెస్ పార్టీవికలాంగుల విభాగం పోరాట ఫలితమే..

తప్పక చదవండి
  • కింది స్థాయిలో వికలాంగుల వ్యతిరేకతతోనే పెన్షన్ పెంచిన కేసీఆర్..
  • బడ్జెట్ లో 5శాతం వికలాంగులకు రావాలని వికలాంగుల హక్కుల చట్టం 2016 చెపుతోంది..
  • ఆ లెక్క ప్రకారం రూ.16 వేల 25 రూపాయల 64 పైసలు రావాలి.. కానీ రూ.4 వేలు మాత్రమే ఇస్తున్నారు..

2011 జనాభా లెక్కల ప్రకారం 10 లక్షల 46 వేల 822 మంది వికలాంగులు ఉన్నారు.. ఇప్పుడు లెక్కలు చూస్తే దాదాపు 13 లక్షల మంది ఉండే అవకాశము.. కానీ అప్పుడు 7రకాల వికలాంగులు.. ఇప్పుడు 14రకాలు పెరిగి 21 రకాల వికలాంగులు ఉన్నారు.. ఈ లెక్క ప్రకారం మరో 4లక్షల మంది పెరిగే అవకాశం అంటే దాదాపు 16నుండి 17లక్షల మంది ఉన్నారు.. ఇప్పుడు 5లక్షల మందికి పింఛన్ ఇస్తే మరో 11 లక్షల మంది ఎటు పోయినట్లు..? అంటే 1/3 వంతు మందికి మాత్రమే పించన్ వస్తుంది.. తెలంగాణ ఏర్పడ్డాక వికలాంగుల సంక్షేమ శాఖను స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో విలినం చేసిన నీచపు చరిత్ర కేసిఆర్ ది.. కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగం, వికలంగుల జేఏసీ అనేక ఉద్యమాలు చెస్తే విలీనము రద్దు చేశారు.. కాంగ్రెస్ తెచ్చిన ఉపాధి హామీ పథకం క్రింద వికలంగులకి 150 రోజులు పని కల్పించాలి.. 25 శాతం పెంచి ఇవ్వాలి.. కానీ ఈ కేసిఆర్ ప్రభుత్వం ఇవ్వడం లేదు.. ఒక్క వికలాంగుడికి కూడా 150 రోజులు కల్పించలేదు.. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వికలాంగులకు మోటరైజ్డ్ వెహికల్ సబ్సిడీ 500 రూపాయలను ఎత్తి వేసింది ఈ దుర్మార్గపు ప్రభుత్వం.. 2014 ఎన్నికలలో జిల్లాకో వికలాంగుల స్టడీ సర్కిల్ ఎర్పాటు చేస్తా అన్న ఈ కేసిఆర్ ప్రభుత్వం చేయకపోగా.. కాంగ్రెస్ ఏర్పాటు చేసిన.. హైదరాబాద్ లో ఉన్న వికలాంగుల స్టడీ సర్కిల్ మూసి వేసింది.. గృహ లక్ష్మి పథకంలో వికలాంగులు అనే పదం లేదు.. అన్నీ సంక్షేమ పథకాలలో 5శాతం కేటాయించాలి.. ఈ రాష్ట్ర ప్రభుత్వమే ఇచ్చిన జీవోని ఈ ప్రభుత్వమే తుంగలో తొక్కింది.. దళిత బందులో దళిత వికలాంగులకు 5శాతం కేటాయించాలి.. 25 శాతం లబ్ధి పెంచి ఇవ్వాలి కానీ ఆ ఉసే లేదు.. వికలాంగులకి ఉన్న 75కి పైగా సంక్షేమ జీవోలని తొక్కి పెట్టింది వాస్తవం కాదా? నిరుద్యోగ వికలంగులకి తీవ్ర అన్యాయం చేయడం వల్ల, ప్రభుత్వం నిర్వహణ చేస్తున్న సాగర్ రింగ్ రోడ్డు వికలాంగుల సదనం లో మహేందర్, హన్మకొండ వికలాంగుల సదనంలో రాగుల రామ్మోహన్ అనే ఉన్నత విద్యావంతుడు, వికలాంగ సోదరులు ఆత్మహత్యలు చేసుకున్నారు.. ఈ ఒక్క ఉదాహరణ చాలు చేసిన అన్యాయం చెప్పడానికి.. వికలాంగుల సంక్షేమం పై చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ కానీ, మంత్రులు కానీ బహిరంగ చర్చకు వస్తే కేసిఆర్ చేసిన మోసాన్ని నిరూపించడానికి కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగం సిద్దంగా ఉంది.. లేదా ప్రగతి భవన్ కి మమ్మల్ని పిలిస్తే మేమైనా చర్చకి వస్తాం అని బహిరంగ సవాల్ చేస్తున్నాము.. కేసీఆర్ కు మానవత్వం ఉంటే వికలాంగుల సంఖ్య ఎంత ఉందో లెక్క తీయాలి.. అంగవైకల్యం ఉన్న వ్యక్తులకు తాత్కాలిక సర్టిఫికేట్ ఇచ్చి సగానికి పైగా పెన్షన్ తొలగిస్తున్నారు.. సర్టిఫికెట్ కోసం నెలల తరబడి ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తోంది.. గత 9 సంవత్సరాలుగా వికలాంగుల దినోత్సవం ఏనాడు హాజరు కాని ముఖ్యమంత్రి కేసిఆర్ మాత్రమే.. ఎన్నికల్లో బీఆర్ఎస్ నాయకులను పొలిమేర తరిమికొడతారు.. కేసీఆర్ ఎన్నికలలో ఇచ్చిన హామీ వికలాంగులకు హెల్త్ కార్డు ఎటుపోయింది? ఇలా చెప్పుకుంటూ పొతే కేసీఆర్ చేసిన 100 రకాల అన్యాయాలను చెప్పగలం.. చర్చ కి వస్తారా? తోక ముడుస్తారా ? చర్చ నుండి కేసీఆర్ పారిపోతే వికలాంగుల సమాజానికి క్షమాపణ చెప్పాలి..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు