Monday, September 9, 2024
spot_img

కార్మికుల భద్రతకు భరోసా ఇవ్వాలి..

తప్పక చదవండి
  • విజ్ఞప్తి చేస్తున్న జీ.హెచ్.ఎం.సి. పారిశుధ్య కార్మికులు..

సంతోష్ నగర్ సర్కిల్ 7 ఐ.ఎస్. సదన్ డివిజన్ లో సోమవారం రోజు సునీత అనే స్వీపర్ కలుపు మొక్కలను తీస్తుండగా ప్రమాదవశాత్తూ ఆమెకు కరెంట్ షాక్ తగలడం జరిగింది. ఆమె కుడి చెయ్యికి తీవ్రమైన గాయమైంది.. చేయి సరిగా పనిచేయడం లేదు.. ఇట్టి విషయం పై అధికారులు డిప్యూటీ కమిషనర్ కి ఫోన్ చేసి సమాచారం అందించడం జరిగింది. అదే విధంగా ఏ.ఎం.ఓ.హెచ్. ఉన్న గ్రూపులో కూడా ఈ విషయం చెప్పడం జరిగింది. కానీ ఆ స్వీపర్ ను ఎవరు కూడా హాస్పిటల్ వచ్చి ఆమెను పరామర్శించలేదు.. ఆ పని చేయండి.. ఈ పని చేయండి.. గడ్డి తీయండి అని చెప్పే ఆఫీసర్లు కార్మికులకు ప్రమాదవశాత్తు ఏమైనా జరిగితే పట్టించుకోవడం లేదని కార్మికులు ఆరోపిస్తున్నారు. వాస్తవానికి మెడికల్ ఆఫీసర్ ని కార్మికుల ఆరోగ్య విషయంలో చూడ్డానికి జిహెచ్ఎంసిలో నియమించడం జరిగింది. కానీ డిప్యూటేషన్ పై వచ్చిన మెడికల్ ఆఫీసర్లు కార్మికుల ఆరోగ్యం పట్ల ఎటువంటి శ్రద్ధ చూపకుండా వేరే వేరే విషయాలలో.. అంటే వాళ్లకు అనుకూలంగా ఉన్న విషయాల్లో మాత్రం చాలా నిబద్ధతగా ఫాలో అవుతున్నారు. కానీ కార్మికులు పనిచేస్తున్న సమయంలో ఏమైనా ఆపద వస్తే అక్కడ ఉన్న ఆఫీసర్ పట్టించుకొకపోవడం శోచనీయం. ఇట్లాంటి విషయాలపై కమిషనర్ కు కూడా వినతిపత్రం ఇవ్వడానికి యూనియన్ నాయకులు సిద్ధం అవుతున్నారు.. కార్మికుల శ్రమను దోచుకుంటున్న అధికారులు.. వారి ఆరోగ్యాలపట్ల శ్రద్ధ చూపించకపోవడం శోచనీయం.. తక్షణమే ఉన్నతాధికారులు స్పందించాలని కార్మికులు కోరుతున్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు