- సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు తిరందాసు సంతోష్ కుమార్..
సమగ్ర శిక్షా కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని, కనీస వేతన పే స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ.. జిల్లా విద్యాశాఖ కార్యాలయం నుండి కలెక్టరేట్ వరకు ర్యాలి నిర్వహించి.. తదనంతరం కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు తిరందాసు సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. గత 11 ఏండ్లుగా సమగ్ర శిక్షలో సిఆర్పిలు, ఎంఐఎస్ కో-ఆర్డినేటర్లు, ఐఈఅర్పిలు, కంప్యూటర్ ఆపరేటర్లు, మెసెంజర్లు, పిటిఐలు, కేజీబీవీ, యూఆర్ఎస్ బోధన, బోధనేతర సిబ్బంది ఉద్యోగులుగా పనిచేస్తున్నారని.. వారందరినీ రెగ్యులరైజ్ చేయాలని, వెంటనే కనీస వేతన పే-స్కేలును అమలు చేయాలన్నారు. మహిళ ఉద్యోగులకు 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు, గ్రూప్ ఇన్సూరెన్స్, నగదు రహిత వైద్య సదుపాయం కల్పించాలని, విద్యాశాఖలో చేపట్టే ప్రభుత్వ నియామకాలలో వెయిటేజీ ఇవ్వాలని, మరణించిన, గాయపడిన ఉద్యోగులకు ఎక్స్ గ్రేషియా చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీ నారాయణ, టి.పీ.యూ.ఎస్. జిల్లా అధ్యక్షులు ఇరుగు శ్రీరాం, ఎస్.టి.యూ. జిల్లా అధ్యక్షులు ఘనపురం భీమయ్య, సోమయ్య, వంగురి నారాయణ యాదవ్, బోయ శ్రీనివాసులు, ధార వెంకన్న, వెంకటేశ్వర్లు, కేశవులు, ప్రవీణ్, గంగరాజు, హమీద్, శ్రీనివాస్, బ్రహ్మచారి, సైదులు, రమేష్ కుమార్, రాజు, నాగభూషణ చారి, బిక్షం, లక్ష్మి, మోయిజ్ తదితరులు పాల్గొన్నారు.