Sunday, October 13, 2024
spot_img

పదేళ్ల బాలికపై అత్యాచార యత్నం..

తప్పక చదవండి
  • బాలిక ప్రతిఘడించడంతో బండరాయితో దాడి..
  • నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన..
  • గాయపడ్డ బాలిక ఉస్మానియాకు తరలింపు..
  • పారిపోయిన నిందితుడు.. దర్యాప్తు చేస్తున్న పోలీసులు..

హైదరాబాద్, 13 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :
పట్టపగలు గుర్తుతెలియని అగంతకుడు పదేళ్ల బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారయత్నానికి తెగబడ్డాడు. బాలిక గట్టిగా కేకలు వేయడంతో ఆగ్రహం చెందిన దుండగుడు బండరాయితో ఆమె తలపై మోది హత్యయత్నానికి పాల్పడి అక్కడి నుండి పారిపోయాడు. ఈ సంఘటన నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ మొగిలిచర్ల రవి కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కాచిగూడ రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న బస్ స్టాప్ లో ఓ మహిళ తన పదేళ్ల బిడ్డతో కలిసి బిక్షటన చేసుకుంటూ జీవనం సాగిస్తోంది.. బాలికపై కన్నేసిన అదే ప్రాంతంలో బిక్షటన చేసే 30 సంవత్సరాల వ్యక్తి అదును కోసం ఎదురు చూస్తున్నాడు. మంగళవారం ఉదయం తల్లి నిద్రమత్తులో ఉండగా ఆ బాలిక టిఫిన్ తినడానికి ఒంటరిగా బయలుదేరింది. ఇది గమనించిన ఆ వ్యక్తి బాలికను అనుసరిస్తూ వచ్చి ఫీవర్ హాస్పిటల్ సమీపంలో ఆమెను కిడ్నాప్ చేసి ఎదురుగా ఉన్న స్ట్రీట్ నెంబర్ 4లోకి తీసుకొచ్చాడు. అక్కడ ఆగి ఉన్న రెండు కార్ల మధ్యలోకి దుండగుడు పాపను తీసుకుని వెళ్లి అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు. దీంతో భయపడి పోయిన బాలిక గట్టిగా అరవడంతో ఆగ్రహం చెందిన దుండగుడు అక్కడే ఉన్న రాయితో ఆమె తలపై కొట్టి హత్యయత్నానికి పాల్పడ్డాడు. అరుపులు ఉన్న స్థానికులు అక్కడికి రావడంతో దుండగుడు అక్కడి నుండి పారిపోయాడు. స్థానికుల సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న నల్లకుంట పోలీసులు తీవ్రంగా గాయపడిన బాలికను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలంలో ఉన్న సిసి ఫుటేజీల ఆధారంగా నిందితుడిని గుర్తించిన పోలీసులు అతని కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. కేసును నల్లకుంట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ మేరకు సమాచారం అందుకున్న రాష్ట్ర బిఆర్ఎస్ నాయకుడు దూసరి శ్రీనివాస్ గౌడ్ సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఘటనకు బాధ్యుడైన దుండగుడిని వెంటనే అరెస్టు చేసి చట్ట పరంగా శిక్షించాలని పోలీసులను అధికారులకు విజ్ఞప్తి చేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు