డాక్టర్ బాత్రాస్ హెల్త్ కేర్, డాక్టర్ బాత్రాస్ ఫౌండేషన్ ప్రతి నెల రెండవ బుధవారం నాడు హైదరాబాద్‌లో 6 క్లినిక్‌ల లో ఉదయం 11:00 నుండి మధ్యాహ్నం 1:00 గంటల మధ్య డాక్టర్ బాత్రాస్ క్లినిక్‌లలో ఉచిత సంప్రదింపులు, మందులను అందిస్తోంది. డాక్టర్ బాత్రాస్ హెల్త్ కేర్ భారతదేశంలోని అత్యంత సందడిగా ఉన్న నగరాల్లో ఒకటైన హైదరాబాద్‌లో మొత్తం 178,651 మంది రాకను చూసింది. ఈ ప్రాంతంలో అనేక రకాల వ్యాధులు, ఆరోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి. జుట్టు, చర్మం, శ్వాసకోశ సమస్యలు, అలెర్జీలు, అనేక ఇతర పరిస్థితులకు సంబంధించిన చికిత్సల కోసం ప్రజలు తరచుగా సందర్శిస్తారు. ఇక్కడి జనాభా ఆరోగ్య సంరక్షణ అవసరాలను తీర్చడానికి, డాక్టర్ బాత్రాస్ హెల్త్ కేర్ నగరంలో కాంప్లిమెంటరీ వైద్య సేవలు, ప్రత్యేక సంరక్షణను అందించే 6 క్లినిక్‌లను శ్రద్ధగా నిర్వహిస్తోంది.
హోమియోపతి మంచితనంతో వివిధ వ్యాధులకు చికిత్స చేయడంలో డాక్టర్ బాత్రాస్ హెల్త్ కేర్ 40 సంవత్సరాలకు పైగా వైద్య నైపుణ్యాన్ని కలిగి ఉంది. 300 మందికి పైగా వైద్యులు, 200 పైగా క్లినిక్‌లతో, డాక్టర్ బాత్రాస్ 15 లక్షల మంది రోగులకు విజయవంతంగా చికిత్స అందించారు. ఆ రోగులు ఇప్పుడు సంతోషంతో ఉన్నారు. డాక్టర్ బాత్రాస్ హెల్త్ కేర్ 160కి పైగా క్లినిక్‌లలో ఉచిత వైద్య సేవలను విస్తరింపజేసి నిరుపేదలకు హోమి యోపతి గొప్పతనాన్ని వ్యాపింపచేస్తుంది.
హోమియోపతి రోగులకు అందించే ప్రయోజనాలు అనేకంగా ఉన్నాయి. అన్నింటిలో మొదటిది, ఇది సంపూర్ణ చికిత్సను అందిస్తుంది. మరో ప్రయోజనం ఏమిటంటే హోమియోపతి సురక్షితమైనది, సహజ చికిత్సను అందిస్తుంది. హోమియోపతి సహాయంతో, 90 శాతం కంటే ఎక్కువ విజయవంతమైన రేటుతో డాక్టర్ బాత్రాస్ హెల్త్ కేర్ అలర్జీలు, ఆస్తమా, జుట్టు రాలడం, మైగ్రేన్, ఆందోళన, డిప్రెషన్, సోరియాసిస్, పీసీఓఎస్, తెల్ల మచ్చలు, మరెన్నో వాటికి అన్ని వయసుల వారికి చికిత్స చేసింది.
ఉచిత క్లినిక్ కార్యక్రమంపై పద్మశ్రీ గ్రహీత (హోమియోపతి), డాక్టర్ బాత్రాస్ హెల్త్ కేర్ వ్యవస్థాపకుడు డాక్టర్ ముఖేష్ బాత్రా మాట్లాడుతూ, “డాక్టర్ బాత్రాస్ లో హోమియోపతి మంచితనాన్ని తాజా అంతర్జాతీయ సాంకేతికతతో మిళితం చేసి రోగులకు ప్రయోజనం చేకూర్చేలా మేం తోడ్పడుతాం. డాక్టర్ బాత్రాస్ లో మేం సమర్థవంతమైన హోమియోపతి చికిత్సను అందిస్తాం. పరిస్థితి తీవ్రత ఆధారంగా పరిష్కారాలను అందిస్తాం. ఇది కాకుండా ఇది ఇతర రకాల చికిత్సల నుండి భిన్నమైనది. ఇది తక్కువ ఖర్చుతో కూడుకున్నది, నాన్-ఇన్వాసివ్, నొప్పిలేకుండా ఉంటుంది’’ అని అన్నారు. ఉచిత సంప్రదింపులు, చికిత్స పొందేందుకు మీ అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవడానికి 86578-78175కు కాల్ చేయండి. మీ సమీపంలోని డాక్టర్ బాత్రా క్లినిక్‌ని గుర్తించడానికి: http://www.drbatras.com ని సందర్శించండి..