Monday, June 17, 2024

శాశ్వత పరిష్కారమే లేదా..?

తప్పక చదవండి
  • తొలగించే కొద్దీ పెరిగిపోతున్న గుర్రపు డెక్కు..
  • సఫిల్ గూడా బండ చెరువులో పెరుగుతున్న సమస్య..
  • దుర్వాసనతో, దోమల బెడదతో ఇబ్బందులు పడుతున్న స్థానికులు..
  • పరిష్కారం కోసం ఇతర దారులు వెతకాలంటున్న ప్రజలు..

మల్కాజ్గిరి,13 జూన్ (ఆదాబ్ హైదరాబాద్) :
ప్రపంచం నింగి వైపు దూసుకుపోయే టెక్నాలజీ అందుబాటులో ఉన్నా, అక్కడక్కడ చిన్న చిన్న సమస్యలకు పరిష్కారం దొరకక అటు ప్రభుత్వాధికారులు, ఇటు ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటారు.. అలాంటి విచిత్రమైన సమస్య మల్కాజ్ గిరి నియోజకవర్గంలోని నెలకొంది.. మల్కాజ్ గిరి నియోజకవర్గం పరిధిలోని సఫిల్ గూడా మినీ ట్యాంక్ బండ్, ఈస్ట్ ఆనంద్ బాగ్, బండ చెరువులో ఎడతెరిపి లేకుండా గుర్రపుడెక్కు పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు ప్రత్యేకంగా గుర్రపుడెక్కుని తొలగించడానికి శాశ్వతంగా యంత్రాన్ని ఏర్పాటు చేసి ఎడతెరిపి లేకుండా గుర్రపుడెక్కును తొలగిస్తున్నా.. ఎంత తీస్తే అంతకు రెట్టింపు గుర్రపుడెక్కు చెరువులలో పెరగడంతో దోమల బాధ, దుర్వాసనతో ప్రజల జీవితాలు అతలాకుతలమవుతున్నాయి. మరి ఇంత జరుగుతునా గుర్రపుడెక్కు పూర్తిస్థాయిలో తొలగించకపోవడంతో ప్రజలు గుర్రపుడెక్కుకి శాశ్వత పరిష్కారం ఉందా..? లేదా..? అని ముక్కున వేలు వేసుకుంటున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు