Friday, May 3, 2024

జనవరిలో ప్రారంభం

తప్పక చదవండి
  • తుదిమెరుగులు దిద్దుకుంటున్న రామ మందిరం
  • అయోధ్య రామ మందిరం గర్భగుడి ఫొటోలు విడుదల చేసిన తీర్థ క్షేత్ర ట్రస్టు

అయోధ్యలోని రామ మందిరం నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఈ ఆలయం వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో, అయోధ్య రామాలయం గర్భగుడి ఫొటోలను శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు నేడు విడుదల చేసింది. మరో నెల రోజుల్లో ఆలయం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ ఫొటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అయితే ఇప్పటికే రామమందిర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆలయ పనులు దాదాపు పూర్తి కావస్తున్నాయి. ఈ క్రమంలోనే అయోధ్య రామాలయ గర్భగుడికి సంబంధించిన ఫోటోలను శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్ విడుదల చేశారు. 2024 జనవరి 22 వ తేదీన ఆలయ ప్రారంభోత్సవం జరగనుంది. ఈ నేపథ్యంలోనే ట్విటర్ వేదికగా రామాలయ గర్భగుడి ఫోటోలను ట్విటర్ వేదికగా చంపత్‌రాయ్‌ విడుదల చేశారు. శ్రీరామచంద్రమూర్తి ఆలయ మొదటి అంతస్తు పనులు దాదాపు పూర్తి అయినట్లు తెలిపారు. ఆలయ గర్భగుడి సైతం దాదాపు సిద్ధమైందని వెల్లడించారు. ఇటీవల లైటింగ్‌ పనులు సైతం పూర్తయినట్లు చంపత్‌రాయ్‌ పేర్కొన్నారు. మరోవైపు జనవరి 22 వ తేదీన అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించేందుకు సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. మరో నెల రోజుల్లో ఆలయం ప్రారంభం కానుంది. రామమందిరం ప్రాణ ప్రతిష్ఠకు ప్రధాని నరేంద్ర మోదీ సహా 130 దేశాల ప్రతినిధులు హాజరు కానున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు