Tuesday, September 10, 2024
spot_img

రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ..

తప్పక చదవండి
  • రెండు తెలుగు రాష్ట్రాలకు మొండిచేయి..
  • ఈ నెల 24న 10 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు..
  • గుజరాత్‌ నుంచి బాబూభాయ్‌, కేశ్రీదేవ్‌ సిన్హ్‌ కు అవకాశం
  • బెంగాల్‌ నుంచి అనంత మహారాజ్‌ కు ఛాన్స్‌..

న్యూ ఢిల్లీ : రాజ్యసభలో ఖాళీ అయిన స్థానాలకు త్వరలో ఎన్నికలు జరుగనున్నాయి. ఇందుకోసం భారతీయ జనతా పార్టీ తన అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఇందులో ఒక్కరంటే ఒక్కరు కూడా తెలుగు రాష్ట్రాలకు చెందిన నేత లేకపోవడం గమనార్హం. బీజేపీ ప్రకటించిన మూడు స్థానాల్లో గుజరాత్‌ నుంచి ముగ్గురు, వెస్ట్‌ బెంగాల్‌ నుంచి ఒకరు ఉన్నారు. వెస్ట్‌ బెంగాల్‌ రాష్ట్రం నుంచి అనంత మహరాజ్‌, గుజరాత్‌ నుంచి బాబూభాయ్‌ జేసంగ్‌ భాయ్‌ దేశాయ్‌, కే శ్రీదేవ్‌ సిన్హ్‌ జాలాకు అవకాశం కల్పించారు. ఈ నెల 24న 10 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. పశ్చిమ బెంగాల్‌ లో 6 స్థానాలు, గుజరాత్‌ లో 3, గోవాలో 1 స్థానానికి ఎన్నికలు జరగబోతున్నాయి. భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌ ఇప్పటికే గుజరాత్‌ నుంచి బీజేపీ తరపున నామినేషన్‌ వేశారు. అయితే, బీజేపీ ప్రకటించిన అభ్యర్థుల్లో రెండు తెలుగు రాష్ట్రాలకు ఒక్కరంటే ఒక్కరికి కూడా అవకాశం దక్కలేదు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు