రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో మానవత్వాన్ని చాటుకున్నారు మైలార్ దేవ్ పల్లి డివిజన్ కార్పొరేటర్, జీ.హెచ్.ఎం.సి. కౌన్సిల్ డబ్ల్యూ.హెచ్.ఐ.పీ. తోకల శ్రీనివాస్ రెడ్డి. నియోజక వర్గ పరిధిలోని బుద్వేల్ భగవత్ గూడలో అకాల వర్షాలకు ఓ వృద్ధురాలి పాత ఇళ్ళు కూలిపోయింది. విషయం తెలుసుకొని హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి.. అక్కడ ఉన్న స్థానికులతో కలిసి సంఘటన స్థలాన్ని పరిశీలించడం జరిగింది. వెంటనే ఆ కుటుంబ సభ్యులను సురక్షిత మైన చోటుకి పంపించారు. ఇళ్లు కోల్పోయిన వృద్ధురాలు, కుటుంబ సభ్యులకు మనో ధైర్యాన్ని ఇచ్చారు. ఇళ్ళు కోల్పోయామని అదైర్య పడవద్దని ఇంటి నిర్మాణానికి తన వంతు సహాయం చేస్తానని, అన్ని విధాలుగా సహకరిస్తానని వృద్ధురాలకు, ఆమె కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు.. వర్షాకాలంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కూలిపోయే దశలో ఉన్న ఇండ్లలో ఉండకూడదని కోరారు. వర్షాల వల్ల ఏదైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని విజ్ఞప్తి చేసారు.