- సిఎం కెసిఆర్ కి ధన్యవాదములు తెల్పిన గుండ్రాతి శారదాగౌడ్..
దేశ విదేశీ యూనివర్సిటీ విద్యార్థులకు పూర్తి రియింబర్స్ మెంట్.. దీని వల్ల పది వేల మంది స్టూడెంట్లకు లబ్ది, సమాజంలో వెనకబడిన వర్గాలు అన్నీ రంగాలలో అభివృద్ధి చెందాలనే ధృడ సంకల్పంతో సిఎం కెసిఆర్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని, ఈ సందర్బంగా మెరికల్లాంటి బీసీ విద్యార్థులు దేశంలోని ప్రతిష్టాత్మకంగా యూనివర్సిటీలు ఐఐటి, ఐఐఎం, సెంట్రల్ వర్సిటీలు సహా 200కు పైగా ఇనిస్టిట్యూట్స్ లలో ప్రవేశం పొందిన వారికి మొత్తం ఫీజులను చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించి బీసీ విద్యార్థుల తల్లితండ్రులకు తీపి కబురు ఇచ్చారు సిఎం కెసిఆర్ అన్నారు శారదాగౌడ్.. ఇప్పటికే అంతర్జాతీయగా యూఎస్, యూకే, ఆస్ట్రేలియా తదితర దేశాలలో చదువు కునే బీసీ విద్యార్థులకు అందిస్తున్న ఓవర్సీస్ స్కాలర్షిప్ తో పాటు రాష్ట్రంలోనూ ఫీజు రియింబర్స్ మెంట్ చెల్లిస్తున్నట్లు మినిస్టర్ గంగుల కమలాకర్ తెలపడం సంతోషదాయకం అన్నారు శారదాగౌడ్
నేడు దేశంలోనే బీసీలకు అత్యధికంగా సామజిక ఆర్థిక రాజకీయ ఉద్యోగ విద్యా ఐటి అవకాశాలు కల్పిస్తూ సంక్షేమ పథకాలలో కూడా పెద్ద పీట వేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణా సిఎం కెసిఆర్ మాత్రమే అన్నారు.. ఆసరా ఫించన్స్ , కళ్యాణ లక్ష్మి, రైతుబంధు, ఉచిత కరెంట్, మెజారిటీ వాటా బీసీ లకే, ఆత్మగౌరవ భవనాలు, గ్రామాల్లో కమ్యూనిటీ భవనాలు, బీసీకుల వృత్తి దారులకు లక్ష సహాయం 327 గురుకుల విద్యాలయాలు అనేక సంక్షేమ కార్యక్రమాలు వాట్ నాట్, కెసిఆర్ అభినవ సంక్షేమ సామజిక విప్లవ నాయకుడు, భవిష్యత్ దర్శనికుడు అన్నారు బీ.ఆర్.ఎస్. రాష్ట్ర సీనియర్ నాయకురాలు, రాష్ట్ర అధ్యక్షులు.. బీసీ మహిళా సంక్షేమ సంఘం…గుండ్రాతి శారదాగౌడ్..