Saturday, July 27, 2024

తెలంగాణాలో పలు జిల్లాల్లో వర్షాలు…

తప్పక చదవండి

రాష్ట్రంలో మరో మూడునాలుగు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని పేర్కొంది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ విభాగం పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. శుక్రవారం నుంచి ఆదివారం వరకు పలు జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడుతాయని, మరికొన్ని చోట్ల మోస్తరు వర్షాపాతం నమోదయ్యే ఛాన్స్‌ ఉందని వివరించింది. ఇదిలా ఉండగా.. ఇవాళ ఉదయం రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. భద్రాద్రికొత్తగూడెం, జయశంకర్‌ భూపాలపల్లి, వికారాబాద్‌తో భారీ వర్షాపాతం నమోదవగా.. ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల, కరీంనగర్, హైదరాబాద్‌ జంట నగరాలతో పాటు పలు జిల్లాల్లో మోస్తరు వర్షాపాతం నమోదైందని టీఎస్‌డీపీఎస్‌ వివరించింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు