Monday, September 9, 2024
spot_img

ఇండోనేషియా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ ప్రిక్వార్టర్స్‌..

తప్పక చదవండి

స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు మళ్లీ రాకెట్‌ ఝుళిపించింది. ఇండోనేషియా ఓపెన్‌ సూపర్‌ 1000 బ్యాడ్మింటన్‌ టోర్నీలో సింధు మంగళవారం తొలి రౌండ్‌లో స్థానిక క్రీడాకారిణి గ్రెగొరియా మరిస్క తన్‌జంగ్‌ను వరుస గేమ్‌లలో ఓడించి ప్రిక్వార్టర్‌కు చేరుకుంది. హెచ్‌.ఎస్‌.ప్రణయ్‌ కూడా ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ప్రవేశించాడు. కాగా త్రిసా-గాయత్రి జోడి తొలి రౌండ్‌లోనే ఇంటిబాట పట్టారు. జంట ఒలింపిక్‌ పతకాల విజేత, ప్రపంచ మాజీ చాంపియన్‌ సింధు ఇటీవలి పరాజయాలను మరిపిస్తూ 38 నిమిషాలలోనే ప్రత్యర్థిని 21-19, 21-15 స్కోరుతో ఓడించింది. గత రెండు టోర్నీలలో తొలి రౌండ్‌లోనే వెనుతిరిగిన సింధు ఈసారి ఆ గండం గట్కెక్కి తదుపరి రౌండ్‌కు చేరుకుంది. తన్‌జంగ్‌పై సింధుకిది తొలి విజయం. గత రెండుసార్లు మాడ్రిడ్‌ మాస్టర్స్‌ ఫైనల్లో, మలేషియన్‌ మాస్టర్స్‌ సెమీఫైనల్లో తన్‌జంగ్‌ చేతిలో సింధు ఓడిపోయింది. ర్యాంకింగ్స్‌లో 13వ స్థానానికి పడిపోయిన సింధు తొలి గేమ్‌లో త్రీవ ప్రతిఘటన ఎదుర్కొంది.

ఆరంభంలో తన్‌జంగ్‌ 9-7 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఒక క్రాస్‌కోర్ట్‌ డ్రాప్‌ షాట్‌తో సింధు ప్రత్యర్థిపై పైచేయి సాధించి 11-10 ఆధిక్యం సాధించింది. ఆ తరువాత చివరి వరకు ఇరువురూ పాయింట్ల కోసం తీవ్రంగా శ్రమించారు. చివరలో తన్‌జంగ్‌ చేసిన మూడు తప్పిదాలతో సింధు తొలి గేమ్‌ను కైవసం చేసుకుంది. ఇక రెండో గేమ్‌లో చాలావరకు సింధుదే పైచేయిగా సాగింది. ఏ దశలోనూ ప్రత్యర్థికి అవకాశమీయకుండా సింధు రెండో గేమ్‌ను, మ్యాచ్‌ను గెలుచుకుంది. ఈ విజయంతో సింధు ముఖాముఖి గెలుపోటముల్లో 8-2 ఆధిక్యంలో నిలిచింది.

- Advertisement -

ఇక ప్రిక్వార్టర్స్‌లో సింధు కఠిన పరీక్ష ఎదుర్కోనున్నది. తదుపరి మ్యాచ్‌లో సింధు మూడో సీడ్‌, చైనాకు చెందిన తై జు యింగ్‌ను ఢీకొననున్నది. ఫామ్‌లో ఉన్న హెచ్‌.ఎస్‌.ప్రణయ్‌ 21-16, 21-14 స్కో రుతో కెంట నిషిమొటోను 60 నిమిషాల్లో ఓడించాడు. ఏడో సీడ్‌ ప్రణయ్‌ గత నెలలో మ లేషియా మాస్టర్స్‌ టైటిల్‌ను గెలుచుకున్నాడు. భారత మహిళల జోడి త్రిసా-గాయత్రి తొలి రౌండ్‌లో జపాన్‌కు చెందిన రిన్‌ ల్వానగ, కీ నకనిషి చేతిలో ఓడారు. కామన్వెల్త్‌ క్రీడల కాంస్య పతక విజేతలు త్రిసా-గాయత్రి 22-20, 12-21, 16- 21తో జపాన్‌ జోడీ చేతిలో ఓడిపోయారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు