Wednesday, February 28, 2024

యానాంలో చిక్కిన పులస చేప

తప్పక చదవండి
  • మార్కెట్‌లో వేలం నిర్వహణ.. రికార్డు ధరకు కొనుగోలు
    కాకినాడకు సమీపంలో ఉన్న కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో రెండు కిలోల పులస చేప చిక్కింది. ఆ పులస చేపను మార్కెట్‌లో అమ్మకానికి పెట్టారు. మత్స్యకార మహిళ రత్నం అమ్మకానికి పెట్టడంతో కొనుగోలు చేసేందుకు పులస ప్రియులు ఎగబడ్డారు. ఈ చేప రికార్డు స్థాయిలో ఏకంగా రూ.16వేలకు అమ్ముడుపోయింది. గతంతో పోలిస్తే.. గోదావరిలో పులస చేప రాక బాగా తగ్గిందనే చెబుతున్నారు స్థానికులు. అంతేకాదు కొందరు నకిలీ పులస చేపల్ని తీసుకొచ్చి మార్కెట్‌లో అమ్మేస్తున్నారు. గోదావరి జిల్లాల్లో ఉండే జనాలు ఒక్కసారైనా పులస రుచి చూడాలని భావిస్తారు. అందుకే మార్కెట్‌లోకి అలా రాగానే.. ఇలా అమ్ముడుపోతున్నాయి. కొందరైతే ఎంత డబ్బు ఖర్చు చేయడానికైనా వెనుకాడరు.. అలా ఉంది మరి పులస క్రేజ్. గోదావరికి ఈ చేప అతి వేగంగా ఎదురీదుతుంది.. సుదూర ప్రాంతాల నుంచి బంగాళాఖాతంలోకి వస్తుంది. ఇవి సంతానోత్పత్తి కోసం న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా, టాంజానియా వంటి సుదూర ప్రాంతాల నుంచి ఖండాలను దాటి వస్తాయట. ఈ చేపలు సీజన సమయంలో.. ఆషాడ, శ్రావణ మాసాల్లో గోదావరిలో గుడ్లు పెట్టి మళ్లీ సముద్రంలోకి తిరిగి వెళ్లిపోతుందని మత్స్యకారుల చెబుతుంటారు. ఈ చేపను ఇలసగా పిలుస్తారు.. చేప గోదావరిలోకి ఎర్రనీరు రాగానే ఎదురీదుతూ నదిలోకి వచ్చి రెండు మూడు రోజుల్లోనే పులసగా మారుతుంది అంటున్నారు. పులస శాస్త్రీయ నామం హిల్సాహిల్సా.. గోదావరి జిల్లాలతో పాటుగా ఒడిశా, బంగ్లాదేశ్ తీరాల్లో ఉంటాయంటున్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోని అంతర్వేది, భైరవపాలెం, నరసాపురంలో కనిపిస్తాయని చెబుతున్నారు. గోదావరి జలాలు సముద్రంలో కలిసే రెండు పాయల దగ్గరే ఈ పులసలు దొరుకుతాయి అంటున్నారు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు