Friday, May 17, 2024

నా మట్టి.. నా దేశం

తప్పక చదవండి
  • 77 వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మేరీ మాటి.. మేరా దేశ్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ప్రధాని..
  • ఆగస్టు 9 నుంచి 30 వరకు కొనసాగనున్న కార్యక్రమం..
  • గురువారం పంచ్ ప్రాణ ప్రతిజ్ఞ చేసిన కేంద్ర మంత్రులు..
  • 2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది : నిర్మలా సీతా రామన్

న్యూ ఢిల్లీ : ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా 77వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీరులను గౌరవించుకోవడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. మేరీ మాటి.. మేరా దేశ్ (నా మట్టి.. నా దేశం) ప్రత్యేక ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం ఆగస్టు 9 నుంచి 30 వరకు కొనసాగనుంది. మేరీ మాటీ మేరా దేశ్ కార్యక్రమంలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మొక్కలు నాటి ‘పంచ్ ప్రాణ్ ప్రతిజ్ఞ’ చేశారు. గురువారం ఒడిశాలోని పూరీలో పర్యటించిన కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, ధర్మేంద్ర ప్రధాన్, బీజేపీ నేత సంబిత్ పాత్ర మేరీ మాటీ మేరా దేశ్ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటి ‘పంచ్ ప్రాణ్ ప్రతిజ్ఞ’ చేశారు. అంతకుముందు ఆర్థిక మంత్రి, విద్యాశాఖ మంత్రి పూరి జగన్నాథ ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. జగన్నాథుడి దర్శనానంతరం ప్రముఖ ఇసుక కళాకారుడు సుదర్శన్ పట్నాయక్ రూపొందించిన సైకత శిల్పాన్ని నిర్మలా సీతారామన్, ధర్మేంద్ర ప్రధాన్ సందర్వించారు. సుదర్శన్ మేరీ మాటీ మేరా దేశ్ అంశంపై ఒక కళాఖండాన్ని సిద్ధం చేశారు. ‘మేరి మాటి, మేరా దేశ్‌’ కార్యక్రమం కింద ‘పంచప్రాన్‌ ప్రతిజ్ఞ’ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మాట్లాడుతూ.. విదేశీయుల బానిసత్వంలో మనలో నాటుకున్న మనస్తత్వాన్ని తొలగించడం చాలా అవసరమన్నారు. అప్పుడే 2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని.. ప్రపంచం గర్వపడేలా రూపొందుతుందని తెలిపారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు