Saturday, June 15, 2024

అంతర్జాతీయ మహాసభలో అనిల్ రెడ్డికి అరుదైన అవార్డ్..

తప్పక చదవండి
  • ప్రపంచ దేశాల్లో తెలంగాణకే పెద్దపీట..
  • అరుదైన అవార్డ్ అందుకున్న తెలంగాణ జర్నలిస్ట్..

థర్డ్ వరల్డ్ కాంగ్రెస్ ఆన్ నేషనల్ ట్రెడిషనల్ మెడిసిన్ మహాసభలు హోలీస్టిక్ మెడిసిన్ రిసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలోని డాక్టర్ అంబేద్కర్ అంతర్జాతీయ కేంద్రంలో జరిగాయి. ఈ మహాసభకు ప్రపంచ దేశాల నుండి 600 మంది సాంప్రదాయ వైద్యులు హాజరయ్యారు. హెచ్ఎంఆర్ఎఫ్ డైరెక్టర్ ఆఫ్ జనరల్ దీపక్ రౌత్, వరల్డ్ వైస్ చైర్మన్ డాక్టర్ షేక్ సుభాని, పి హెచ్ సి సి ఫౌండర్, డైరెక్టర్ ఆఫ్ జనరల్ ప్రొఫెసర్ డాక్టర్ పి ఎస్ సాగర్, ఆధ్వర్యంలో జరిగిన ఈ అంతర్జాతీయ సాంప్రదాయ వైద్య మహాసభలకు ముఖ్య అతిధులుగా ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్ అడ్జడికేటర్ డా. ప్రవీణ్ కుమార్ ఐ.ఎ.ఎస్., నేపాల్ దేశానికి చెందిన డాక్టర్ రామ్ ఆధార్ యాదవ్
( హెల్త్ మినిస్ట్రీ ), అనంత్ బిరధర్ మినిస్ట్రీ ఆఫ్ ఆయుషి, సిబి లోహ్య టెక్నికల్ అడ్వైజర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాంప్రదాయ వైద్యంతో ఎటువంటి జబ్బునైనా నయం చేయవచ్చునని, ఇప్పటికే ప్రపంచమంతా సాంప్రదాయ వైద్యం వైపు మొగ్గు చూపుతున్నారన్నారు. ఔషధ మొక్కల పెంపకం వాటి గుణాలు రోగి జబ్బుల లక్షణాలు సాంప్రదాయ వైద్యంపై ప్రత్యేక కథనాలు అందించి అనేకమంది రోగులకు అవగాహన కల్పించేలా చేసి మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేసిన తెలంగాణ రాష్ట్రం నుండి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి కర్ర అనిల్ రెడ్డిని నేపాల్ దేశానికి చెందిన డాక్టర్ రామ్ ఆధార్ యాదవ్
( హెల్త్ మినిస్ట్రీ ) చేతుల మీదుగా కోవిద్ పురస్కార్ అవార్డుతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అనిల్ రెడ్డి మాట్లాడుతూ.. అనేక దేశాల నుండి వచ్చిన వందల మంది సాంప్రదాయ వైద్యుల మద్య తెలంగాణ రాష్ట్రం నుండి నన్ను గుర్తించి సత్కరించడం చాలా గర్వంగా ఉందన్నారు. ఈ అంతర్జాతీయ సాంప్రదాయ వైద్య మహాసభల్లో ఇండియా, యూకే, బంగ్లాదేశ్, నేపాల్. సింగపూర్. శ్రీలంక , పిలిపియన్స్, కెనడా, ఆస్ట్రేలియా, మలేషియా ఇండోనేషియా నుండి మహాసభలకు డెలిగేట్స్ పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు