Sunday, July 21, 2024

అబ్దుల్ కలాం నీ మానవత్వానికి సలాం..

తప్పక చదవండి

మిసైల్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా’గా గుర్తింపు పొందిన డాక్టర్‌ ఎ.పి.జె.అబ్దుల్‌ కలాం, భారత రాష్ట్రపతి పదవిని చేపట్టిన మొదటి శాస్త్రవేత్త మాత్రమే కాక అత్యధిక ఓట్లు సాధించిన మొదటి రాష్ట్రపతి. ఆ పదవికి వన్నె తెచ్చిన మహోన్నత వ్యక్తులలో ఒకరిగా ఆయన చరిత్ర సృష్టించారు. దేశ 11వ రాష్ట్రపతిగా 2002 నుండి 2007 వరకు పదవిలో కొనసాగిన ఆయన నిరాడంబర జీవితం మరియు అసాధారణమైన వ్యక్తిత్వం ఎందరికో ప్రేరణగా నిలుస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. భారత దేశ క్షిపణి ప్రాజెక్టులైన పృథ్వీ మరియు అగ్నిలను అభివృద్ధి చేయడంలో ఆయన చేసిన కృషి అత్యంత శ్లాఘనీయమైనది. అతను మొదటి స్వదేశీ ఉపగ్రహ ప్రయోగ వాహనాన్ని అభివృద్ధి చేయడంలో కూడా ప్రముఖ పాత్ర పోషించారు. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలో ఏర్పడిన స్తంభనను తొలగించడానికి ఉపయోగించే కరోనరీ స్టెంట్‌లను క్షిపణి మిశ్రమాలతో అభివృద్ధి చేసి 1990ల మధ్యకాలంలో వాటి ధరను రూ.55 వేల నుండి రూ.10 వేలకు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. తమిళనాడు రాష్ట్రం రామేశ్వరంలోని ధనుష్కోడిలో నిరుపేద జాలరుల కుటుంబంలో 15 అక్టోబర్‌ 1931 న జన్మించిన అవుల్‌ పకీర్‌ జైనుల్‌ ఆబదీన్‌ అబ్దుల్‌ కలాం తన అకుంఠిత దీక్షాదక్షతలతో జాతి గర్వించదగ్గ రాష్ట్రపతిగా జాతీయ మరియు అంతర్జాతీయ ఖ్యాతి గడిరచారు.
నిరాడంబర జీవితం:27 జూలై 2015 న భారత మాజీ రాష్ట్రపతి గా అబ్దుల్‌ కలాం మరణించే నాటికి ఆయన వద్ద కేవలం 2,500 పుస్తకాలు, ఒక చేతి గడియారం, ఆరు చొక్కాలు, నాలుగు ప్యాంట్లు, మూడు సూట్లు మరియు ఒక జత బూట్లు మాత్రమే ఉండటం ఆయన నిరాడంబరతకు తార్కాణం. తుది శ్వాస వరకు కూడా ఆయన తాను రచించిన పుస్తకాలపై వచ్చే రాయల్టీ మరియు ప్రభుత్వం నుండి పొందే పింఛనుతో అత్యంత సాధారణ జీవితం గడిపారు. జాతీయతా భావం మూర్తీభవించిన ఆయన విద్యాభ్యాసం పూర్తిగా స్వదేశంలోనే కొనసాగింది. తిరుచిరాపల్లి లోని సెయింట్‌ జోసెఫ్‌ కళాశాలలో భౌతిక శాస్త్రం, 1960లో చెన్నై లోని మద్రాస్‌ ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ నుండి ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌లో పట్టా పొందారు. డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌ మెంట్‌ సర్వీస్‌ (ణRణూ)లో సభ్యత్వం పొందిన తరువాత ఆయన శాస్త్రవేత్తగా డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ (ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో, భారత ప్రభుత్వం ద్వారా) యొక్క ఏరోనాటికల్‌ డెవలప్‌మెంట్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌లో చేరారు.
ప్రేరణాత్మకమైన వ్యక్తిత్వం: తన ప్రేరణాత్మక ప్రసంగాల ద్వారా, ఆయన యువతరంతో పాటు పెద్దలను ఇట్టే ఆకర్షించేవారు. అత ని కలం నుండి జాలువారిన ‘‘వింగ్స్‌ ఆఫ్‌ ఫైర్‌’’ తో సహా అనేక పుస్తకాలు అత్యంత పాఠకాదరణ పొందడమే కాక అత్యధి కంగా అమ్ముడుపోయాయి. విద్యార్థులతో సమయాన్ని గడిపేందు కు అమితంగా ఇష్టపడే ఆయన రాష్ట్రపతిగా ఉన్నప్పుడు కూడా ఉప న్యాసాలు మరియు సెమినార్లలో నిమగ్నమయ్యేవారు. మానవత్వా నికి నిలువెత్తు నిదర్శనం అబ్దుల్‌ కలాం అని ఆయనతో చిన్నపాటి అనుబంధం కలిగిన వారు కూడా నిస్సందేహంగా వెలిబుచ్చే అబి óప్రాయం. ఆయన లోని ఈ పార్శ్వాన్ని ధృవీకరించ డానికి రెండు దశాబ్దాల క్రితం తన వద్ద డ్రైవర్‌ గా పనిచేసిన కథిరేశన్‌ ఇప్పుడు తమిళనాడులోని అరిజ్ఞార్‌ అన్నా ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాలలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ గా ఎదగడానికి అందించిన ప్రేరణను చక్కటి ఉదాహరణగా పేర్కొనవచ్చు. 1979లో భారత సైన్యంలో చేరి భోపాల్‌ లో ఎలెక్ట్రికల్‌ మెకానిక్‌ గా శిక్షణ పొందిన కథిరేశన్‌, మాజీ సైనికోద్యోగిగా 1980 చివరి దశకంలో హైదరాబాద్‌లోని డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ లాబొరేటరీ (ణRణూ)లో అబ్దుల్‌ కలాం వద్ద డ్రైవర్‌గా చేరి దాదాపు ఐదున్నర సంవత్సరాలు సేవలందించారు. తన వద్ద డ్రైవర్‌ గా పని చేసే కథిరేశన్‌ తీరిక సమయాల్లో వార్తాపత్రికలు, మ్యాగజైన్లు, చరిత్ర పుస్తకాలు ఆసక్తిగా చదవడం గమనించిన అబ్దుల్‌ కలాం ఆయన ను ఉన్నత చదువు కొనసాగించమని ప్రోత్సహించడమే కాక అందుకు ఆర్ధిక సహాయం కూడా అందించారు. అబ్దుల్‌ కలాం స్ఫూర్తిదాయకమైన మాటలు తన కలలకు రెక్కలు తొడిగాయని, ఆయన మాటలతో ప్రేరణ పొందిన తాను, తండ్రి మరణంతో అర్థాంతరంగా నిలిపి వేసిన చదువును పునఃప్రారంభించేందుకు నిర్ణయించుకు న్నాను అంటారు కథిరేశన్‌. అబ్దుల్‌ కలాం ఢల్లీికి బదిలీ అయినప్పటికీ ఆయన రగిల్చిన స్ఫూర్తి కథిరేశన్‌ లో ఏమాత్రం చల్లారలేదు. 10వ తరగతి బోర్డ్‌ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించిన తరువాత ఆయన మదురై కామరాజ్‌ విశ్వవిద్యాలయం నుండి వరుసగా బి ఏ (చరిత్ర), ఎం ఏ (చరిత్ర) లో పట్టా అందుకున్నారు. 1996లో తాను చేస్తున్న డ్రైవర్‌ ఉద్యోగానికి రాజీనామా చేసి తిరునల్వే లిలోని ముఖ్య విద్యాశాఖాదికారి కార్యాలయంలో సూపర్వైజర్‌గా చేరారు. ఆ తరువాత తిరునల్వే లిలో ఎం ఏ (రాజనీతి శాస్త్రం) మరియు పీ హెచ్‌ డి (చరిత్ర) పూర్తిచేసి 47 సంవత్సరాల వయసులో సేలం జిల్లాలోని అరిజ్ఞార్‌ అన్నా ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాలలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ గా చేరి అక్కడ పనిచేస్తున్నారు.
కథిరేశన్‌ డిఆర్‌డిఎల్‌లో చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి తిరునల్వేలి లోని ముఖ్య విద్యాశాఖాదికారి కార్యాలయంలో సూపర్వైజర్‌గా చేరినట్లు అబ్దుల్‌ కలాంకు ఉత్తరం ద్వారా తెలియచేయగా, అప్పటికే భారత రాష్ట్రపతి పదవిలో ఉన్న అయన ప్రత్యుత్తరం పంపడం మానవ సంబంధాలకు ఆయన ఇచ్చే విలువను సూచిస్తుంది. ఆ అపురూపమైన ఉత్తరం ఇప్పటికీ కథిరేశన్‌ వద్ద భద్రంగా ఉంది. తండ్రి ద్వారా వారసత్వంగా సంక్రమించిన కొద్దిపాటి భూమిపై వచ్చే ఆదాయంతో, తన నుంచి డబ్బు ఆశించకుండానే తన భార్య కుటుంబాన్ని నడిపించగా తన జీతం పూర్తిగా చదువుకే ఖర్చుపెట్టారు ఆయన. డ్రైవర్‌గా తన పనివేళలు ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉండడంతో సాయంత్రం తనకు చదువుకోవడానికి అనువుగా ఉండేదని, డిఆర్‌డిఎల్‌ లోని ప్రతి ఒక్కరి నుండి తాను ప్రేరణ పొందానంటారాయన. ఒకప్పటి డ్రైవర్‌ స్థాయి నుండి నేడు ఈ స్థాయికి చేరుకోవడానికి డా అబ్దుల్‌ కలాం అందించిన తోడ్పాటు గురించి ఎంత చెప్పినా తక్కువే అని అందుకు తాను ఆయనకు ఆజన్మాంతం రుణపడి ఉంటానని కథిరేశన్‌ కృతజ్ఞతాభావం వ్యక్తం చేస్తారు. మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌ కలాం ఒకసారి దక్షిణ తమిళనాడులోని చిన్న పట్టణమైన విరుదునగర్‌లోని కళాశాల కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లారు. సమీపంలోని గ్రామం నుండి ఆయనను కలవడం కోసం ఒక సందర్శకుడు కార్యక్రమానికి ఆలస్యంగా రావడంతో, సెక్యూరిటీ సిబ్బంది ఆ సందర్శకుడిని కళాశాల గేటు వద్దనే నిలిపేశారు. అబ్దుల్‌ కలాంను కలిసితీరాలన్న పట్టుదలతో ఉన్న ఆ సందర్శకుడు అక్కడ గేటు వద్దనే ఆయన బయటికి వచ్చే వరకు నిరీక్షించి ఆయన దృష్టిని ఆకర్షించాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఆ సందర్శకుడు గతంలో అబ్దుల్‌ కలాం హైదరాబాద్‌ లోని డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ లాబొరేటరీలో డైరెక్టర్‌గా పనిచేసిన కాలంలో ఆయన వద్ద డ్రైవర్‌ గా పనిచేసిన కథిరేసన్‌.
మూర్తీభవించిన మానవత్వం: 2006 జనవరి 20న ఒడిశా రాష్ట్రం, కేంద్రపారా జిల్లా ఖారినాశి గ్రామం లో అత్యంత పేదరి కంతో జీవిస్తున్న త్రిపుర దాస్‌ అనే వ్యక్తి తన కుటుంబం ఎదుర్కొ ంటున్న ఇక్కట్లను వివరిస్తూ 2005 లో సంభవించిన వరదల అనంతరం తాను జిల్లా యంత్రాంగంలో తాత్కాలిక ప్రాతిపదికన డ్రైవర్‌గా పని చేసినట్లు పేర్కొంటూ, స్పెషల్‌ రిలీఫ్‌ కమిషన్‌ కార్యాలయం మరియు పోలీస్‌ శాఖలో ఖాళీలున్నట్లు తన దృష్టికి వచ్చిన దరిమిలా తనకు ఆ రెండు శాఖలలో ఎందులోనైనా ఉద్యో గం కల్పించాలని కోరుతూ 2006 జనవరి 20న లేఖ రాశారు. అందుకు తక్షణమే స్పందించిన అబ్దుల్‌ కలాం, త్రిపుర దాస్‌ కు డ్రైవర్‌ ఉద్యోగం ఏర్పాటు చేయవలసిందిగా 2006 మార్చి 23న కేంద్రపారా జిల్లా పోలీస్‌ సూపరింటెండెంట్‌ కు ఉత్తరం పంపడంతో ఆయనకు ప్రభుత్వ ఉద్యోగం దక్కింది. అదే విధంగా, మహాకాలాపాడ్‌ బ్లాక్‌ పరిధిలోని బడతోట గ్రామానికి చెందిన మరో యువకుడు తపన్‌ మండల్‌, కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ లో మాస్టర్స్‌ డిగ్రీ చేయాలనే తన ఆశయ సాధనకు తన కుటుంబ ఆర్ధిక పరిస్థితి అవరోధంగా మారిందని తెలియజేస్తూ అబ్దుల్‌ కలాంకి లేఖ రాయగా, తపన్‌ కు ఉన్నత చదువులు అభ్యసించేం దుకు రూ.66,000 విద్యా ఋణం మంజూరు చేయవలసిందిగా రాష్ట్రపతి కార్యాలయం నుండి స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ కు ఆదేశాలు అందాయి. రాష్ట్రపతి కార్యాలయ చొరవతో విద్యా ఋణం పొంది ఎం సి ఏ పూర్తిచేసిన అతను ఆ తరువాత బెంగళూరులోని యాక్సెంచర్‌ లో సీనియర్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ గా ఉద్యోగం పొందాడు. అంతే కాదు. జూలై 2005లో ఒలవర్‌ గ్రామంలో హెచ్‌ ఐ వి పాజిటివ్‌ సోకిన ఇద్దరు అనాథ తోబుట్టువులు తమ దుస్థితిని వివరిస్తూ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాంకు లేఖ రాయగా, ఆయన వారికి రూ.20 వేల ఆర్థిక సహాయం అందించారు. ఇవి ఆయన మానవత్వాన్ని చాటిచెప్పే కేవలం రెండు మూడు ఉదంతాలు మాత్రమే.
భారత క్షిపణి పితామహుడు: తన క్షిపణి రక్షణ కార్యక్రమంతో భారతదేశం గర్వపడేలా చేసిన ప్రసిద్ధ శాస్త్రవేత్త అబ్దుల్‌ కలాం. భారత రాష్ట్రపతి పదవిని అధిరోహించక ముండు, రక్షణ పరిశోధ న అభివృద్ధి సంస్థ, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (IూRూ)లో ఏరోస్పేస్‌ ఇంజనీర్‌గా పనిచేసిన ఆయన ‘‘భారతదేశ మిస్సైల్‌ మ్యాన్‌’’ (వీఱంంఱశ్రీవ వీaఅ శీట Iఅసఱa)గా పేరుగాంచారు. ఆయన ప్రత్యేకించి బాలిస్టిక్‌ క్షిపణి, ప్రయోగ వాహన సాంకేతిక అభివృద్ధి కోసం అవిరళ కృషి చేసారు. ఆయన 1998లో భారత దేశం నిర్వహించిన పోఖ్రాన్‌ఱఱ అణు పరీక్షలలో కీలకమైన, సంస్థా గత, సాంకేతిక, రాజకీయ పాత్ర పోషించారు. 2002 రాష్ట్రపతి ఎన్ని కలలో భారతీయ జనతా పార్టీ ఆయనను అభ్యర్థిగా ప్రతిపాది ంచ గా, ప్రతిపక్ష కాంగ్రెస్‌ అందుకు మద్ధతు తెలిపింది. ఆ ఎన్ని కల లో వామపక్షాలు బలపరిచిన లక్ష్మీ సెహగల్‌పై ఆయన గెలిచారు. కలాం తనపుస్తకం ఇండియా2020లో, 2020నాటికి భారత దేశాన్ని ఒక అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి అభివృద్ధి ప్రణాళికలు సూచించారు. ఆయన భారతదేశపు అత్యున్నత పౌర పురస్కారమైన ‘‘భారతరత్న’’ తో సహా అనేక ప్రతి ష్ఠాత్మక అవా ర్డులను అందుకున్నారు. 2012లో ది హిస్టరీ ఛానల్‌, రిలయన్స్‌ మొబైల్‌ భాగస్వామ్యంతో అవుట్‌ లుక్‌ మ్యాగజైన్‌ నిర్వహించిన ది గ్రేటెస్ట్‌ ఇండియన్‌ పోల్‌లో ఆయన రెండవ స్థానంలో నిలిచారు.
విద్యార్థులకు బోధించడం ఆయనకు అత్యంత ప్రీతికరమైన వ్యాప కం. జూలై 27, 2015న తన 83 వ సంవత్సరంలో భారత మాజీ రాష్ట్రపతి డా అబ్దుల్‌ కలాం ఐఐఎం షిల్లాంగ్‌లో ఉపన్యసిస్తూ ఒక్క సారిగా కుప్పకూలి మరణించారు. ఆయన స్వస్థలం రామే శ్వరం లో జరిగిన అంత్యక్రియలకు జాతీయ స్థాయి ప్రముఖులతో సహా వేలాది మంది సామాన్య ప్రజలు విచ్చేసి నివాళులర్పించారు.

  • ఏచన్ చంద్ర శేఖర్, 8885050822
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు