- మూడు రోజుల పర్యటన చేయనున్న ప్రెసిడెంట్..
- స్వాగతం పలికిన సురినాంలోని భారత రాయబారి..
- రాష్ట్రపతిగా ఆమెకిది తొలి పర్యటన..
- అమెరికాలో భారత ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం
చేయడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశ్యం..
మూడు రోజుల పర్యటన నిమిత్తం ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము ద్రౌపది ముర్ము ఆదివారం సురినామ్ చేరుకున్నారు. సురినామ్ ప్రోటోకాల్ చీఫ్, సురినామ్ లోని భారత రాయబారి ఆమెకు స్వాగతం పలికారు. దక్షిణ అమెరికా దేశంతో భారత్ ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడమే ఆమె పర్యటన ఉద్దేశం. గత ఏడాది జులైలో రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్రపతి పర్యటించడం ఇదే తొలిసారి.
ప్రెసిడెంట్ పాటు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి నిరంజన్ జ్యోతి, పార్లమెంటు సభ్యురాలు రమా దేవి అధికారిక భారత ప్రతినిధి బృందంలో భాగంగా ఉన్నారు. ప్రెసిడెంట్ గా తన తొలి విదేశీ పర్యటనలో భాగంగా సురినాంలోని పరమరిబోకు ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము చేరుకున్నారని అధికారిక ఖాతా ట్వీట్ చేసింది. సురినామ్ అధ్యక్షుడు సి. సంతోక్షి విమానాశ్రయంలో ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ముకు పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో స్వాగతం పలికారు.