Thursday, April 25, 2024

ఇంటర్మీడియట్ గెస్ట్ అధ్యాపకుల హృదయ రోదన..

తప్పక చదవండి
  • తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో
    ఇంటర్ గెస్ట్ అధ్యాపకల అరణ్య రోధన,
    ఆకలి మంటలు ఎవరకి పట్టావా.. ?

ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన మాటను అమలు చేయని ఇంటర్ విద్యాశాఖ ముఖ్య అధికారులు. గత విద్య సంవత్సరం పని చేసిన వారిని కొనసాగించమని విద్యశాఖ మంత్రి చెప్పిన , ప్రిన్సిపాల్ సెక్రటరీ చెప్పిన ఇంటర్ విద్య అధికారులు మాత్రం కనికరం చూపించడం లేదు .

నిద్రలేవగానే ఓ దిగులు, కంట తడి పెట్టించే దృశ్యాలు, కొంతమంది అతిథి అధ్యాపకుల కష్టాలు… ఓ చీకటమ్మా.. అప్పుడే తేలవారకే.. మా కష్టం ఈ చీకట్లో ఎవరికి తెలియకుండా పడుకుంటది. తెల్లారితే చాలు ఉద్యోగం లేక కుటుంబం చీదరించుకుంటది.. పెళ్ళాం ఉద్యోగం ఉంది కదా ..అని పెళ్లి చేసుకున్నా అంటూ కసురుకుంటది..! పిల్లలు ..నాన్న ఎం పనికి పోడా అమ్మా.. అని ప్రశ్నించేటప్పుడు గుండెల్లో ఎదో తెలియని బాద, అలజడి.. మనోళ్ళకన్నా మన పక్కకున్న వాళ్ల బాధలు ఎక్కువ..ఎప్పుడూ చూసిన ఇంట్లోనే ఉంటున్నారు ఉద్యోగం తొలగించారంట …అనుకుంటే ఏందో మా జీవితం అనిపిస్తుంది.. ఈ బాధలకు తోడు అప్పులోళ్ళ బాధలే ఎక్కువ…సదువుకున్నా సదువుకు ఉద్యోగం ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ తీసుకున్న నాయకులు..ఎవర్ని అడగాలో తెలియదు..?ఎందుకు ఇస్తలేరో తెలియదు..?
నాయకుళ్లరా..! ఈ పాపం ఎవరిది. సమాజంలో సదువుకున్నోళ్లను అవమానించడం మీకు న్యాయమేనా…! ఇప్పుడిస్తాం..అప్పుడిస్తాం.. త్వరలో ఇస్తాం.. అని ఎందుకు కాలయాపన చేస్తున్నారు… ఇవ్వము అని తేల్చి చెప్పొచ్చుగా.. మీరు చెప్పే పిచ్చి మాటలు నమ్మి నిండుప్రాణాలు పోయేలా ఉన్నాయిగా..అన్యాయం.. అబద్ధాలు.. చెప్తూ..ఉంటే ఎట్లా..ఒక్కసారి ఆలోచించండి.. ఇప్పటికే గెస్ట్ లెక్చరర్ల గుండెలు అలిసిపోయి ఆగిపోయేలా.. ఉన్నాయి..ఎంతో మందికి ఆదుకున్న మీరు కక్ష్య వదిలి సదువు సెప్పే సారోళ్లకు గిప్పుడన్న రెన్యూవల్ ఇచ్చి ,12 నెలల పూర్తి వేతనం ఇచ్చి ఆదుకోండి. 8 నెలలగా వేతనాలు లేక ఇబ్బంది పడుతున్న అతిథి అధ్యాపకుల ఆవేదనను అర్థం చేసుకోండి ప్రభుత్వ పెద్దలారా..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు