Monday, October 14, 2024
spot_img

బోనాలకు ముందే ఆర్థిక సహాయం..

తప్పక చదవండి

ఆషాఢ బోనాల ఉత్సవాల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 15 కోట్లను కేటాయించిందని రాష్ట్ర పశు సంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ వెల్లడించారు. బోనాలకు ముందే ఆర్ధిక సహాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని వివరించారు. బోనాల ఉత్సవాల నిర్వహణకు గాను ప్రైవేట్‌ దేవాలయాలకు ప్రభుత్వం ఈ నిధులను కేటాయించిందని తెలిపారు.

ఆర్ధిక సహాయం కోసం వారం రోజుల్లో ఆలయ కమిటీలు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. బోనాలకు ప్రతి ఏటా సీఎం కేసీఆర్‌ ప్రైవేట్‌ దేవాలయాలకు ఆర్థిక సహాయం అందిస్తున్నారని ఆయన వివరించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత బోనాలను రాష్ట్ర పండుగగా ప్రకటించిందని గుర్తు చేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు