శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివారలను ఎంపీ పోతుగంటి రాములు బుధవారం దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన ఆయనకు కృష్ణదేవరాయ గోపురం వద్ద ఈవో లవన్న ఆధ్వర్యంలో అర్చకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన స్వామి, అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అలాగే పరివార దేవతలను సైతం దర్శించుకున్నారు. ప్రాకర మండలంలో వేదాశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందించి, శేషవస్త్రంతో సత్కరించారు. అనంరతం ఆర్యవైశ్య నిత్యాన్నదన భవనం ప్రారంభోత్సవ వేడుకలు పాల్గొన్నారు. క్షేత్రంలో ఆర్యవైశ్యులు నూతనంగా నిర్మించిన నిత్యాన్నదాన భవనం అందరినీ ఆదర్శనీయమైందన్నారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శ్యామ్ సుందర్, శ్రీరాములు ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు ఎంపీని సన్మానించారు. శ్రీశైల మహా క్షేత్రంలో దశాబ్దాల కాలంగా భక్తులకు సేవలందిస్తున్న కరివేణ నిత్యాన్నదాన సత్రం దేశవ్యాప్తమవ్వాలని, ఆధ్యాత్మిక సేవలను విస్తృతం చేయాలని విజయవాడ ఎమ్మల్యే మల్లాది విష్ణు అన్నారు. కరివేణ నూతన భవన సముదాయాన్ని శాస్ర్తోక్తంగా ప్రారంభించారు. కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు, మాజీ ఉపసభాపతి కోన రఘుపతి ముఖ్య అతిథులుఆ హాజరయ్యారు. ఈ సందర్భంగా బ్రహ్మణులకు అండగా ఉంటామని అన్నారు. అదే విధంగా శ్రీశైల మహా క్షేత్రంలో అన్ని రాష్ర్టాలకు సంబంధించిన కరివేణ శాఖలను నెలకొల్పేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు కమిటీ అధ్యక్ష కార్యదర్శులు, సభ్యులు పేర్కొన్నారు