Sunday, May 19, 2024

గాలి నుంచి స్వచ్ఛమైన విద్యుత్తు..

తప్పక చదవండి

అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ మసాచుసెట్స్‌ అమ్హెరెసెట్స్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ అత్యద్భుత ఆవిష్కరణ చేసింది. పలుచని గాలి నుంచి విదుత్తును ఉత్పత్తి చేశారు. 10 నానోమీటర్ల కంటే తక్కువ వ్యాసం కలిగిన నానోపోర్‌లతో పదార్థాన్ని పెప్పర్‌ చేయడం ద్వారా గాలిలోని తేమ నుంచి నిరంతరం విద్యుత్తును సేకరించే పరికరంగా ఏ పదార్థాన్నైనా మార్చవచ్చని నిరూపించారు. పలుచని గాలి నుంచి క్లీన్‌ విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నట్టు పరిశోధక బృందంలో ఒకరైన ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్‌ విద్యార్థి షావోమెంగ్‌ లియు పేర్కొన్నారు. గాలిలో ఉన్న విద్యుత్తు, మేఘాలు, నీటి బిందువుల ద్రవ్యరాశిని కలిగి ఉంటాయని పరిశోధకులు తెలిపారు. ‘జెనరిక్‌ ఎయిర్‌-జెన్‌ ఎఫెక్ట్‌’ విధానంపై ఇది పనిచేస్తుందని పేర్కొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు