Sunday, September 8, 2024
spot_img

షిండే వర్గానికి గడ్డు కాలం..

తప్పక చదవండి
  • షిండే వర్గాన్ని వీడేందుకు సిద్ధమైన 22 మంది ఎమ్మెల్యేలు, 9 మంది ఎంపీలు..
  • సంచలన విషయాన్ని వెల్లడించిన శివసేన అధికారిక పత్రిక సామ్నా..

మహారాష్ట్రలో మరోసారి రాజకీయ సంక్షోభం నెలకొనేలా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే నేతృత్వంలోని శివసేనకు చెందిన 22 మంది ఎమ్మెల్యేలు, 9 మంది ఎంపీలు భారతీయ జనతా పార్టీ పట్ల అసంతృప్తిగా ఉన్నారని శివసేన (యూబీటీ) పార్టీ అధికారిక పత్రిక ‘సామ్నా’ పేర్కొంది. వారంతా పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారని తెలిపింది. ఇదే విషయంపై ఠాక్రే వర్గం ఎంపీ వినాయక్‌ రౌత్‌ మాట్లాడుతూ.. పార్టీ వీడేందుకు సిద్ధపడ్డ శాసనసభ్యులు తమ పార్టీతో టచ్‌లో ఉన్నారంటూ బాంబ్‌ పేల్చారు. వారి నియోజకవర్గాల్లో ఎలాంటి అభివృద్ధి జరగనందున అసంతృప్తి చెందిన షిండే నేతృత్వంలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీని వీడుతున్నారని చెప్పారు.

కాగా, ఇటీవల శివసేన సీనియర్‌ నేత గజానన్‌ కీర్తికర్‌ బీజేపీ తీరుపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారని సామ్నా గుర్తు చేసింది. ఎన్‌డీఏ ప్రభుత్వంలో భాగమైనప్పటికీ తమ పట్ల బీజేపీ వివక్ష చూపుతోందని కీర్తికర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, కీర్తికర్‌ అసమ్మతి వ్యక్తం చేసిన కొద్ది రోజులకే బీజేపీ-శివసేన కూటమిలోని ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని వినాయక్‌ రౌత్‌ చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు