Tuesday, March 5, 2024

ప్రజాప్రతినిధులే భాగస్వాములుగా అక్రమ నిర్మాణాలు

తప్పక చదవండి
  • చీర్యాల్‌లో పుట్ట గొడుగుల్లా పుట్టుకొస్తున్న ఇల్లీగల్ కన్ స్ట్రక్షన్స్..
  • కళ్ళముందు కనిపిస్తున్నా చోద్యం చూస్తున్న అధికారులు..
  • ప్రజా ప్రతినిధుల జేబులు ఫుల్, గ్రామ పంచాయతీ ఇన్కమ్ నిల్..

చీర్యాల్ గ్రామ పంచాయతీలో అక్రమ నిర్మాణాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. నిబంధనలకు పాతరేస్తూ, అడ్డూ అదుపూ లేకుండా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి.. సర్వే నంబర్లు 330, 331, 332, 333, 334, 335, 336 లలో అక్రమ నిర్మాణాల తంతు కొనసాగుతున్నా, పట్టించుకోవాల్సిన పంచాయతీ అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. ప్రజా ప్రతినిధులే భాగస్వాములుగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

నిర్మాణ అనుమతులు ఉన్నాయంటూ దొంగ పత్రాలు సృష్టిస్తూ పని కానిచ్చేస్తున్నారు. ఎల్‌ఆర్‌ఎస్, ఎలాంటి పంచాయతీ అనుమతులు లేకపోయినా నిర్మాణాలు చేపట్టాలనుకొనే బిల్డర్లు చీర్యాల్ గ్రామ పంచాయతీని అనువైనదిగా ఎంచుకుంటున్నారంటే అందుకు ప్రజాప్రతినిధులు, అధికారుల సహాయ సహకారాలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అక్రమ నిర్మాణదారులు అధికారులను ప్రసన్నం చేసుకోవడం కారణంగానే గ్రామ పంచాయతీ ఆదాయానికి భారీగా గండి కొడుతూ అక్రమ కట్టడాలు పుట్ట గొడుగుల్లా పుట్టుకొస్తున్నాయని స్థానికులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. అక్రమ కట్టడాలపై వార్తాపత్రికలలో వార్తలు వస్తే, హడావుడి చేసి అనంతరం అక్రమ కట్టడాలను ప్రోత్సహించడం ఇక్కడి అధికారులకే చెల్లిందనడానికి గ్రామంలో ఎక్కడ చూసినా కనిపించే అనుమతి లేని కట్టడాలే నిదర్శనం.

- Advertisement -

ఇప్పటికైనా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్, ఉన్నత అధికారులు స్పందించి, అక్రమ నిర్మాణాలను అరికట్టి, గ్రామ పంచాయతీ ఆదాయానికి గండి పడకుండా చూడాలని, గ్రామస్తులు కోరుతున్నారు.

పంచాయతీ కార్యదర్శి వివరణ :
గ్రామంలో అక్రమ నిర్మాణాలను ఉపేక్షించేది లేదని చీర్యాల్ గ్రామ పంచాయతీ కార్యదర్శి భాస్కర్ అన్నారు. అనుమతి లేని నిర్మాణాలకు నోటీసులు జారీ చేసి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు త్వరలోనే చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనుమతి లేని ఇండ్లని కొని కొనుగోలుదారులు మోసపోవద్దని తెలిపారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు