Sunday, May 5, 2024

పోడు భూమి లబ్ధిదారులకు శుభవార్త..

తప్పక చదవండి
  • ఈనెల 30న భూ పట్టాల పంపిణీ కార్యక్రమం..
  • పట్టాలు పంపిణీ చేయనున్న సీఎం కేసీఆర్..
  • అదే రోజు ఆసిఫాబాద్ కలెక్టర్ కార్యాలయ ప్రారంభం..

హైదరాబాద్, 24 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :
తెలంగాణలో పోడు పట్టాల పంపిణీ కార్యక్రమం వాయిదా పడింది. తెలంగాణలోని కుమ్రం భీం అసిఫాబాద్ జిల్లా నుంచి పోడు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని శనివారం నుంచే ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం ముందుగా నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో సంక్షేమ పథకాల అమలులో సర్కార్ స్పీడ్ పెంచింది. సీఎం కేసీఆర్ జిల్లాల్లో బిజిబిజీగా పర్యటిస్తూ పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నారు. ఇప్పటికే రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. మరో రెండుమూడ్రోజుల్లో రైతు బంధు నిధులు కూడా విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలోని పోడు భూములు సాగు చేసుకుంటున్న లబ్ధిదారులకు పట్టాల పంపిణి కార్యక్రమం చేపట్టింది. కొన్ని అనివార్య కారణాల వాళ్ళ వాయిదా పడడంతో ఈనెల 30న రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లబ్ధిదారులకు పోడు భూముల పట్టాలు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది. జాతీయ ఎన్నికల కమిటీ రాష్ట్రంలో పర్యటిస్తుండడం, అందుకు సంబంధించి కలెక్టర్లకు శిక్షణాతరగుతులు నిర్వహిస్తుండటంతో పాటు ఈ నెల 29 న బక్రీద్ పండుగ మెుదలైన అంశాలను పరిగణలోనికి తీసుకొని పట్టాల పంపిణీ తేదీని మార్చారు.

జూన్ 30న ఆసిఫాబాద్ జిల్లా కలక్టరేట్ కార్యాలయం, జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. అదే వేదికగా.. పోడు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం లాంఛనంగా ప్రారంభిస్తారని సీఎంవో వర్గాలు వెల్లడించాయి. ఇక జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు పోడు పట్టాల పంపిణీ చేయనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 2,845 గ్రామాలు తాండాలు, గూడేల పరిధిలో ఆదివాసీ, గిరిజనుల ఆధ్వర్యంలో ఉన్న 4,01,405 ఎకరాల పోడు భూములకు అధికారులు ఇప్పటికే పట్టాలను సిద్ధం చేశారు. వీటి ద్వారా 1,50,224 మంది గిరిజనులకు లబ్ధి చేకూరనుంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు