Monday, April 29, 2024

పోడు పండుగ

తప్పక చదవండి

మహిళల పేరు మీదే పోడు పట్టాలు

  • పట్టాలు పొందిన రైతులకు రైతుబంధు
  • రాష్ట్రంలో 4 లక్షల 50 వేల ఎకరాలకు పట్టాలు
  • పట్టాలతో పాటు పోడు కేసుల ఎత్తివేత
  • ఇకముందు వారిపై ఎలాంటి కేసులూ ఉండవు
  • ఆసిఫాబాద్‌ జిల్లాల్లోనే 47వేల ఎకరాలకు పోడు పట్టాలు
  • ఏజెన్సీ ప్రాంతాల్లో త్రీ ఫేజ్‌ కరెంట్‌కు ఆదేశాలు
  • కౌటాలా, వార్ధా మధ్య బ్రిడ్జికి రూ.75 కోట్లు మంజూరు
  • ఆసిఫాబాద్‌ వేదికగా సీఎం కేసీఆర్‌ ప్రకటన

వర్షాకాలం వచ్చిందంటే మంచం పట్టిన మన్యం అంటూ ఒకప్పుడు పేపర్‌లో వార్తలు వచ్చేవని, అంటురోగాలతో ఆదిలాబాద్‌ అడవిబిడ్డలు సతమతమయ్యేవారని, ఇప్పుడు ఆ దుస్థితి లేదని, మిషన్‌ భగీరథ ద్వారా మంచి నీళ్లు తెచ్చుకున్నామని, వైద్య వ్యవస్థను బాగుచేసుకున్నామని, అందుకే ఇవాళ మన్యం మంచం పట్టే సమస్య లేదు ..ఒక్క ఆసిఫాబాద్‌ జిల్లాల్లోనే 47 వేల ఎకరాలకు గిరిజన పోడు పట్టాలు ఇస్తున్నాం. రేపట్నుంచే మీ మంత్రి, ఎమ్మెల్యేలు ఈ 47 వేల ఎకరాల భూమిని వెంటనే అందజేస్తారు. రానున్న మూడు రోజుల్లోనే పట్టాలు అందుతాయి. ఎవరెవరు ఆదివాసీలు, గిరిజన బిడ్డలకు త్రీఫేజ్‌ కరెంట్‌ లేదో వాళ్లకు రాబోయే రెండు మూడు నెలల్లోనే పొలాలకు త్రీఫేజ్‌ కరెంట్‌ ఇవ్వడం జరుగుతుంది. పోడు భూములు కొట్టుకున్నందుకు ఆదివాసీ గిరిజన బిడ్డల మీద గతంలో కేసులు పెట్టారు. ఒకవైపు పట్టాలు ఇచ్చి ఆ కేసులు అలాగే ఉంచితే తలాతోక లేనట్టు అవుతుంది కాబట్టి వెంటనే ఆ కేసులను ఎత్తివేస్తాం` సీఎం కేసీఆర్‌

- Advertisement -

కుమ్రంభీమ్‌ ఆసిఫాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా పోడు పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ అన్నారు. పోడు పట్టాలను మహిళల పేరుమీదనే ఇస్తున్నామని అన్నారు. పోడు భూములకు పట్టాలు పొందిన రైతులకు ఇతర రైతులకు మాదిరిగానే రైతుబంధు ఇవ్వనున్నట్లు వెల్లడిరచారు. కార్యక్రమంలో కొందరు గిరిజన రైతులకు రైతుబంధు చెక్కులను అందజేశారు. పోడు పట్టాలను మహిళల పేరు మీదనే ఇస్తున్నట్లు తెలిపారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వడం మాత్రమే కాదని, ఈ భూములకు సంబంధించి గతంలో గిరిజనులపై నమోదైన కేసులను కూడా ఎత్తివేస్తామని చెప్పారు.ఆసిఫాబాద్‌ జిల్లా వ్యాప్తంగా పోడు పట్టాలను పంపిణీ చేస్తున్నట్టు ఆయన తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షా 51 మంది రైతులకు నాలుగు లక్షల 50 వేల ఎకరాల పోడు భూమిని పట్టాలు ఇచ్చి పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యోగులంతా సహకరించారని సీఎం గుర్తుచేసుకున్నారు. ఆసిఫాబాద్‌ జిల్లాలో డిస్ట్రిక్ట్‌ ఇంటిగ్రేటెడ్‌ ఆఫీసెస్‌ కాంప్లెక్స్‌ను ప్రారంభించి, పోడు పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా ఉద్యోగులు, గిరిజనులను ఉద్దేశించి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రసంగించారు. ఆసిఫాబాద్‌ జిల్లాలో రెండు మూడు రోజుల్లో పోడు పట్టాల పంపిణీ కార్యక్రమం పూర్తవుతుందని సీఎం చెప్పారు. ఇప్పటివరకు గిరిజన గ్రామాలకు కరెంటు సదుపాయం కల్పన దాదాపు పూర్తయ్యిందని, ఇకపై అన్ని జిల్లాల్లో మారుమూల గ్రామాల్లో ఉన్న గిరిజనుల పొలాలకు కూడా త్రీఫేజ్‌ కరెంటు ఇస్తామని సీఎం ప్రకటించారు.తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా తాను ఏ పిలుపునిచ్చినా ఉద్యోగులు శక్తివంచన లేకుండా తమవంతు కృషిచేశారని సీఎం కేసీఆర్‌ కొనియాడారు. అందరి సహకారం వల్లే నాడు స్వరాష్ట్ర కల సాకారమైందన్నారు. స్వరాష్ట్రంలో అభివృద్ధి వేగంగా జరుగుతున్నదని చెప్పారు. జిల్లాలో డిస్ట్రిక్ట్‌ ఇంటిగ్రేటెడ్‌ ఆఫీసెస్‌ కాంప్లెక్స్‌ను ప్రారంభించుకోవడం సంతోషకరమైన సందర్భమన్నారు. నూతన ఎస్పీ ఆఫీస్‌ను కూడా ప్రారంభించుకున్నామని చెప్పారు. త్వరలో మెడికల్‌ కాలేజీ కూడా అందుబాటులోకి రానున్నదని సీఎం పేర్కొన్నారు. అంతకుముందు డిస్ట్రిక్ట్‌ ఇంటిగ్రేటెడ్‌ ఆఫీసెస్‌ కాంప్లెక్స్‌ను ప్రారంభించేందుకు వచ్చిన ముఖ్యమంత్రికి పురోహితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆ తర్వాత సీఎం జిల్లా కార్యాలయాల సముదాయాన్ని ప్రారంభించింది కలెక్టర్‌ను ఆయన సీట్లో కూర్చోబెట్టారు. అనంతరం కలెక్టర్‌కు పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ కూడా సీఎంకు శాలువా కప్పి సన్మానించారు. పర్యావరణ పరిరక్షణను గుర్తుచేసే చిత్రపటాన్ని బహూకరించారు. ఆ తర్వాత కలెక్టరేట్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర మంత్రులు మహమూద్‌ అలీ, ఇంద్రకరణ్‌రెడ్డి, విప్‌ బాల్క సుమన్‌, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, రాష్ట్ర డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ అంజనీకుమార్‌, జిల్లా కలెక్టరేట్‌ ఉద్యోగులు, గిరిజనులు, గిరిజన నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గిరిజనులకు పోడు పట్టాలు అందించడంతో పాటు వారికి మరో శుభవార్తను కేసీఆర్‌ అందించారు. పోడుభూములకు సంబంధించి ఆదివాసీ గిరిజన బిడ్డలపై పెట్టిన కేసులు ఎత్తివేస్తామని సీఎం కేసీఆర్‌ తెలిపారు. ఇక వారిపై ఎలాంటి కేసులు ఉండవని స్పష్టం చేశారు. పట్టాలు పంపిణీ చేసిన అనంతరం కుమ్రంభీమ్‌ ఆసిఫాబాద్‌ జిల్లాలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌ మాట్లాడారు. తెలంగాణ వచ్చిన తర్వాత పేదల బతుకుల గురించి ఆలోచించి చాలా కార్యక్రమాలు తీసుకొచ్చామని చెప్పారు. తెలంగాణ వచ్చిన తర్వాత పేదల బతుకులను ఆలోచించి చాలా కార్యక్రమాలు తీసుకున్నాం. ఒక్క ఆసిఫాబాద్‌ జిల్లాల్లోనే 47వేల ఎకరాలకు గిరిజన పోడు పట్టాలు ఇస్తున్నాం. ఇందాకే డజన్‌ పట్టాలు అందజేశా. రేపట్నుంచే మీ మంత్రి, ఎమ్మెల్యేలు ఈ 47వేల ఎకరాల భూమిని వెంటనే అందజేస్తారు. రానున్న మూడు రోజుల్లోనే పట్టాలు అందుతాయి. పట్టాలు అందడమే కాదు.. అందరూ రైతులకు వచ్చినట్టుగా పోడు పట్టాలు పొందినవారికి ఈ ఫసల్‌ నుంచే రైతుబంధు రాబోతున్నది. గతంలో 300 కోట్లు పెట్టి ఎక్కడెక్కడ అటవీ ప్రాంతాల్లో, ఏజెన్సీ ప్రాంతాల్లో త్రీఫేజ్‌ వైర్‌ కనెక్షన్‌ లేదో అక్కడ 300 కోట్లు పెట్టి కరెంట్‌ ఇవ్వమని చెప్పినం. అయితే బావుల్లోకి ఇంకా పోలేదని ఆత్రం సక్కూగారు చెప్పారు. దీనిపై చీఫ్‌ సెక్రటరీకి ఆదేశాలివ్వడం జరిగింది. ఎవరెవరు ఆదివాసీలు, గిరిజన బిడ్డలకు త్రీఫేజ్‌ కరెంట్‌ లేదో వాళ్లకు రాబోయే రెండు మూడు నెలల్లోనే పొలాలకు త్రీఫేజ్‌ కరెంట్‌ ఇవ్వడం జరుగుతుందన్నారు. పోడుభూములు కొట్టుకున్నందుకు ఆదివాసీ గిరిజన బిడ్డల మీద గతంలో కేసులు పెట్టిండ్రు. ఒకవైపు పట్టాలు ఇచ్చి ఆ కేసులు అలాగే ఉంచితే తలాతోక లేనట్టు అవుతుంది కాబట్టి వెంటనే ఆ కేసులను ఎత్తివేస్తాం.. వారిపై కేసులు ఉండవని సీఎం కేసీఆర్‌ తెలిపారు. తెలంగాణ ఉద్యమం సమయంలో అడవి ప్రాంతాలు తిరుగుతున్నప్పుడు.. మావా నాటె.. మావా రాజ్‌.. నా గూడెంలో నా రాజ్యం.. మా తండాలో మా రాజ్యం అని చెప్పేవాళ్లు. అనేక దశాబ్దాలు మీరు పోరాటం చేసినా అది సాధ్యం కాలేదు. కానీ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో దాదాపు 3 నుంచి 4వేల గిరిజన గూడేలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయడమే కాదు.. కుమ్రంభీమ్‌ పేరిట కుమ్రంభీమ్‌ ఆసిఫాబాద్‌ జిల్లా ఏర్పాటు చేసుకున్నాం. ఉద్యమం సమయంలో మీరంతా సహకరించి నాతో పోరాటంలో ఉన్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ వచ్చింది కాబట్టే కుమ్రంభీమ్‌ జిల్లా వచ్చింది. ఈ రోజు ఆసిఫాబాద్‌ జిల్లా చాలా చక్కటి ఎస్పీ, కలెక్టరేట్‌ కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నందుకు అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. ఒకప్పుడు బెజ్జూర్‌ నుంచి ఆదిలబాద్‌ పోవాలంటే చాలా బాధపడేవాళ్లు. కానీ ఇప్పుడు జిల్లా కలెక్టరేట్‌, జిల్లా ఎస్పీ కార్యాలయం, ఇంకా చాలా జిల్లా కార్యాలయాలు మీ ముంగిట్లకే రావడం చాలా సంతోషించే విషయమని సీఎం కేసీఆర్‌ అన్నారు. వర్షాకాలం వచ్చిందంటే మంచం పట్టిన మన్యం అని ఒకప్పుడు పేపర్‌లో వార్తలు వచ్చేవి. అంటురోగాలతో ఆదిలాబాద్‌ ఆడవిబిడ్డలు సతమతమై చనిపోయేవాళ్లు. మిషన్‌ భగీరథ ద్వారా చక్కటి నీళ్లు తెచ్చుకున్నాం. వైద్య వ్యవస్థను బాగుచేసుకున్నాం కాబట్టి ఇవాళ మన్యం మంచం పట్టే సమస్య లేనే లేదు. గత మూడేండ్లుగా అటువంటి దుస్థితి నుంచి బయటపడ్డాం. ఒకప్పుడు మారుమూల ప్రాంతంగా ఉన్న ఆసిఫాబాద్‌లో మెడికల్‌ కాలేజీ ఏర్పాటు కావడం చాలా అద్భుతమైన విషయం. ఆ విషయంలో కూడా సక్కూ గారికి, లక్ష్మీగారికి, మీ అందరికీ హృదయ పూర్వక అభినందనలు అని సీఎం కేసీఆర్‌ తెలిపారు. కోనేరు కోనప్ప వెంటబడి ప్రాణహిత మీద బ్రిడ్జి మంజూరు చేయించారు. కొన్ని కొత్త మండలాలు ఏర్పాటు చేయించారు. అదేవిధంగా ఇప్పుడు కౌటాల మండలం నుంచి వార్దా నది మీదుగా మహారాష్ట్ర పోవడానికి బ్రిడ్జి కావాలని చెప్పిండు. 75 కోట్లతో దాన్ని మంజూరు చేయడం జరిగింది. ఆ జీవోను ఇప్పుడే అందజేస్తున్నా. ఆసిఫాబాద్‌కు టెక్నికల్‌ కాలేజీ కావాలని కోనప్ప అడిగారు. వెంటనే ఐటీఐ కాలేజీని కాగజ్‌నగర్‌కు మంజూరు చేస్తున్నా అని తెలియజేసారు. నాగమ్మ చెరువులో బుద్ధుడిని పెట్టుకున్నాం.. దాన్ని మినీ ట్యాంక్‌బండ్‌లా ఏర్పాటు చేయాలని అడిగారు. ఒక్క ఆసిఫాబాద్‌ జిల్లాల్లోనే 47 వేల ఎకరాలకు గిరిజన పోడు పట్టాలు ఇస్తున్నాం. రేపట్నుంచే మీ మంత్రి, ఎమ్మెల్యేలు ఈ 47 వేల ఎకరాల భూమిని వెంటనే అందజేస్తారు. రానున్న మూడు రోజుల్లోనే పట్టాలు అందుతాయి. ఎవరెవరు ఆదివాసీలు, గిరిజన బిడ్డలకు త్రీఫేజ్‌ కరెంట్‌ లేదో వాళ్లకు రాబోయే రెండు మూడు నెలల్లోనే పొలాలకు త్రీఫేజ్‌ కరెంట్‌ ఇవ్వడం జరుగుతుంది. పోడు భూములు కొట్టుకున్నందుకు ఆదివాసీ గిరిజన బిడ్డల మీద గతంలో కేసులు పెట్టారు. ఒకవైపు పట్టాలు ఇచ్చి ఆ కేసులు అలాగే ఉంచితే తలాతోక లేనట్టు అవుతుంది కాబట్టి వెంటనే ఆ కేసులను ఎత్తివేస్తాంసీఎం కేసీఆర్‌ ఒక్క ఆసిఫాబాద్‌ జిల్లాల్లోనే 47 వేల ఎకరాలకు గిరిజన పోడు పట్టాలు ఇస్తున్నాం. రేపట్నుంచే మీ మంత్రి, ఎమ్మెల్యేలు ఈ 47 వేల ఎకరాల భూమిని వెంటనే అందజేస్తారు. రానున్న మూడు రోజుల్లోనే పట్టాలు అందుతాయి. ఎవరెవరు ఆదివాసీలు, గిరిజన బిడ్డలకు త్రీఫేజ్‌ కరెంట్‌ లేదో వాళ్లకు రాబోయే రెండు మూడు నెలల్లోనే పొలాలకు త్రీఫేజ్‌ కరెంట్‌ ఇవ్వడం జరుగుతుంది. పోడు భూములు కొట్టుకున్నందుకు ఆదివాసీ గిరిజన బిడ్డల మీద గతంలో కేసులు పెట్టారు. ఒకవైపు పట్టాలు ఇచ్చి ఆ కేసులు అలాగే ఉంచితే తలాతోక లేనట్టు అవుతుంది కాబట్టి వెంటనే ఆ కేసులను ఎత్తివేస్తాం సీఎం కేసీఆర్‌ ఒక్క ఆసిఫాబాద్‌ జిల్లాల్లోనే 47 వేల ఎకరాలకు గిరిజన పోడు పట్టాలు ఇస్తున్నాం. రేపట్నుంచే మీ మంత్రి, ఎమ్మెల్యేలు ఈ 47 వేల ఎకరాల భూమిని వెంటనే అందజేస్తారు. రానున్న మూడు రోజుల్లోనే పట్టాలు అందుతాయి. ఎవరెవరు ఆదివాసీలు, గిరిజన బిడ్డలకు త్రీఫేజ్‌ కరెంట్‌ లేదో వాళ్లకు రాబోయే రెండు మూడు నెలల్లోనే పొలాలకు త్రీఫేజ్‌ కరెంట్‌ ఇవ్వడం జరుగుతుంది. పోడు భూములు కొట్టుకున్నందుకు ఆదివాసీ గిరిజన బిడ్డల మీద గతంలో కేసులు పెట్టారు. ఒకవైపు పట్టాలు ఇచ్చి ఆ కేసులు అలాగే ఉంచితే తలాతోక లేనట్టు అవుతుంది కాబట్టి వెంటనే ఆ కేసులను ఎత్తివేస్తాం` సీఎం కేసీఆర్‌

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు